Begin typing your search above and press return to search.

ఏపీ శాసనమండలి చైర్మన్ కి కరోనా పాజిటివ్....!

By:  Tupaki Desk   |   1 Sept 2020 12:45 PM IST
ఏపీ శాసనమండలి చైర్మన్ కి కరోనా పాజిటివ్....!
X
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తుంటే ఉంది. ప్రతి రోజు కూడా దాదాపుగా పది వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సామాన్యుల నుండి.. రాజకీయ ప్రముఖులు.. ప్రజా ప్రతినిధులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు.. మంత్రులు.. మాజీ మంత్రులు.. ఎంపీలు కరోనా బారిన పడగా.. తాజాగా శాసనమండలి చైర్మన్ కరోనా బారిన పడ్డారు. ఏపీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌కు కరోనా సోకింది. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయన్ను హైదరాబాద్ ‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షరీఫ్‌ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, తెదేపా నేతలు ఆకాంక్షించారు.

ఇకపోతే, ఏపీలో ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిలతో పాటూ మరికొందరు కరోనా బారిన పడ్డారు. మరోవైపు కరోనా కేసుల నమోదులో సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌ దేశంలో రెండో స్థానానికి చేరింది. ఇప్పటివరకూ ఆ స్థానంలో ఉన్న తమిళనాడును వెనక్కు నెట్టి ఆ స్థానాన్ని ఏపీ ఆక్రమించింది. మహారాష్ట్ర 7,80,689 కేసులతో తొలిస్థానంలో ఉంది.