Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : 24 మంది ఎంపీలకి , 8 మంది కేంద్రమంత్రులకు పాజిటివ్ !
By: Tupaki Desk | 14 Sept 2020 2:40 PM ISTదేశంలో కరోనా కలకలం కొనసాగుతుంది. సామాన్య ప్రజల నుండి ప్రజా ప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా 24 మంది ఎంపీలు , ఎనిమిది మంది కేంద్ర మంత్రులు కరోనా వైరస్ బారినపడ్డట్లు అధికారుల వెల్లడించారు. నేడు ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల సమయంలో ఇంతమందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడంతో కలవరాన్ని కలిగిస్తోంది. అయితే వర్షకాల పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యే ముందు ఉభయ సభల సభ్యులందరూ కరోనా మహమ్మారి పరీక్ష చేయించుకుని తప్పనిసరిగా కరోనా నెగెటివ్ రిపోర్టును సమర్పించాలి. ఇందుకు పార్లమెంటరీ సెషన్ ప్రారంభానికి 72 గంటలలోపు ప్రభుత్వం అనుమతి పొందిన ఏదైనా ఆసుపత్రి గానీ, ప్రయోగశాలలో గానీ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో పరీక్షలు తప్పనిసరి చేశారు.
లోక్ సభ సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లి పలువురు ఎంపీలకు కరోనా పాజిటివ్ గా తేలినట్టుగా తెలుస్తోంది. ఏపీకి చెందిన వారిలో కూడా ముగ్గురు ఎంపీలకు కరోనా పాజిటివ్ గా తేలినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వంగా గీత, గొడ్డేటి మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్పలకు కరోనా పాజిటివ్ గా వచ్చిందని తెలుస్తుంది. వీళ్లు స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ గా తేలారని సమాచారం. ఏకంగా ఇంతమంది ఎంపీలు, కేంద్రమంత్రులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో, సమావేశాల నిర్వహణ ఎలా జరుగుతుందనేది విశేషంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకేసారి ఇంతమందికి పాజిటివ్ గా తేలడంతో మిగిలిన వారందరిలో కొంచెం టెంక్షన్ నెలకొన్నది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసారి అఖిలపక్ష సమావేశాన్ని కూడా రద్దు చేసింది ప్రభుత్వం. నేరుగా బీఏసీ సమావేశం నిర్వహించి సభలో చర్చించాల్సిన అంశాల అజెండాను ఖరారు చేశారు. కరోనావైరస్ కారణంగా, ఈ ఏడాది వర్షకాల పార్లమెంటు సమావేశానికి అనేక మార్పులు చేశారు. ప్రతిరోజూ నాలుగు గంటల సెషన్లను మాత్రమే నిర్వహించాలని తెలిపారు. క్వశ్చన్ అవర్‌ను తీసేశారు. జీరో అవర్‌ను తగ్గించేశారు. ప్రతీ రోజు నాలుగు గంటలపాటు మాత్రమే సమావేశాలు జరగనున్నాయి. సామాజిక దూర ప్రమాణాలను నిర్ధారించడానికి, రాజ్యసభ ఛాంబర్, గ్యాలరీలు, లోకసభ ఛాంబర్ సభ్యులను కూర్చునేందుకు ఉపయోగిస్తున్నారు.