Begin typing your search above and press return to search.
అర్ధరాత్రి బాత్ రూంలోకి వెళ్లి కరోనా పేషెంట్.. తీరా చూస్తే అంతా షాక్!
By: Tupaki Desk | 24 April 2021 12:00 PM ISTకరోనా మహమ్మారి ఎందరో జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. కాగా దీనినే అదునుగా మార్చుకున్నాడు ఓ కరోనా పేషెంట్. అంతేకాదు ఎందరినో వణికించిన వైరస్ నే తన అస్ర్తంగా మార్చుకున్నాడు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఓ పక్కా ప్లాన్ రచించాడు.
ఆంధ్రప్రదేశ్లోని హిల్ కాలనీలో జరిగిన ఓ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమాండ్ కు తరలిస్తున్న నేపథ్యంలో ఒకరికి కరోనా నిర్ధరణ అయింది. బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి ఆ కరోనా బాధితుడు బాత్ రూంకి వెళ్లాడు.
రాత్రి 11.45కి బాత్ రూంకి ఎంతకీ తిరిగి రాకపోవడంతో అక్కడి పోలీసులు బాత్ రూం తలుపులు పగలగొట్టి చూశారు. తీరా చూస్తే అందరూ షాక్ అయ్యారు. అక్కడ నిందితుడు లేడు. పక్కనే కిటికీనుంచి చెట్టు మీదకు దూకి కిందకు దిగి పరారైనట్లుగా గుర్తించారు. ఈ సంఘటనపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గుంటూరు జిల్లా కావడంతో అక్కడికి వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు.
కరోనా సోకిన వ్యక్తి మరీ ఇలా చేయడంతో పోలీసులతో పాటు స్థానికులూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ పట్ల ఆ నిందితుడు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్టు కాదని అంటున్నారు. బాత్ రూంకి వెళ్లిన వ్యక్తి ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదని పోలీసులు అంటున్నారు.