Begin typing your search above and press return to search.

విమానంలో కరోనా పేషేంట్ మృతి .. పసిగట్టలేకపోయిన సిబ్బంది !

By:  Tupaki Desk   |   22 Oct 2020 6:40 PM IST
విమానంలో కరోనా పేషేంట్ మృతి .. పసిగట్టలేకపోయిన సిబ్బంది !
X
కరోనా మహమ్మారి పాజిటివ్ వచ్చిన ఓ ప్రయాణికురాలు విమానంలో విమానంలోనే మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ ప్రయాణికురాలు కరోనా మహమ్మారి తో మరణించినా కూడా ఆమెకి వైరస్ ఉన్నట్టు అధికారులు గుర్తించలేకపోవడం గమనార్హం. జులై 24న టెక్సాస్‌ కు చెందిన మహిళ స్పిరిట్ ఎయిర్ ‌లైన్స్‌ విమానంలో లాస్ వేగాస్ నుంచి డల్లాస్‌ కు వెళ్తున్న సమయంలో మార్గమధ్యలోనే మృతిచెందింది. విమానం గాల్లో ఉండగానే ప్రయాణికురాలు స్పృహ తప్పి పడిపోవడంతో అల్బూక్వర్క్‌ విమానాశ్రయానికి పైలట్ అత్యవసరంగా మళ్లించారు . అయితే , అప్పటికే ఆమె చనిపోయిందని అల్బూక్వర్క్ ఎయిర్ ‌పోర్ట్ అధికార ప్రతినిధి స్టీఫెన్ కిట్స్ వెల్లడించారు.

అయితే, ఉలుకు పలుకు లేకుండా అచేతనస్థితిలోకి వెళ్లిపోయిన ఆమెకు ఊపిరి ఆగిపోయిందని పోలీసు నివేదిక తెలిపింది. ఆ మహిళను ప్రయాణికురాలికి క్యాబిన్ క్రూ సీపీఆర్ నిర్వహించడానికి ప్రయత్నించాడని తెలిపింది. విమానం అత్యవసరంగా అల్బూక్వర్క్ విమానాశ్రయంలో దింపిన తర్వాత సిబ్బంది ఆమెను కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వివరించింది. మహిళ మరణం గురించి తొలిసారి వెల్లడించిన డల్లాస్ కౌంటీ జడ్జి కార్యాలయం ఆమెకు అనారోగ్య సమస్యలున్నట్టు వెల్లడించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు మాత్రం కరోనా వల్లే ఆమె చనిపోయిందని, అలాగే ఆమెకు ఆస్తమా, ఇతర అనారోగ్య కారణాలు కూడా ఉండటంతో ఆమె మృతి చెందింది అని తెలిపింది.

ఎయిర్ ‌పోర్ట్ సిబ్బంది మాత్రం ఆమెకు కరోనా వైరస్ బారినపడ్డ విషయాన్ని గుర్తించలేకపోయారని, దీనిని సాధారణ అనారోగ్యంగా భావించారు. అయితే, డల్లాస్ కౌంటీ మాత్రం ఆమె కరోనాతో చనిపోయినట్టు ప్రకటించింది. తీవ్రమైన అనారోగ్య పరిస్థితులతో అంతరాష్ట్ర ఎయిర్‌లైన్స్ విమానంలో ఆమె చనిపోయింది అని వెల్లడించింది.