Begin typing your search above and press return to search.

కరోనా : అక్కడ ఒకేరోజు 475 మంది మృతి

By:  Tupaki Desk   |   19 March 2020 3:00 AM GMT
కరోనా : అక్కడ ఒకేరోజు 475 మంది మృతి
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రెండు లక్షలను మించింది. ఇక మరణాల సంఖ్య పది వేలకు చేరుతోంది. ఆసియా దేశాలతో పోల్చితే యూరప్‌ లో కరోనా వైరస్‌ వ్యాప్తి విపరీతంగా ఉంది. చైనాలో కరోనా వ్యాప్తి శాతం తగ్గుతున్న సమయంలో యూరప్‌ లో మాత్రం కరోనా ఉదృతి మరింత పెరిగింది.

ఇటలీలో నిన్న ఒక్క రోజే ఏకంగా 475 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అక్కడ అత్యంత వేగంగా కరోనా వ్యాప్తి చెందుతున్నట్లుగా చెబుతున్నారు. అక్కడి వాతావరణ పరిస్థితులు మరియు ఇతరత్ర కారణాల వల్ల వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పాటు మృతుల సంఖ్య కూడా అత్యధికంగా ఉంటున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అక్కడి ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నష్టం మాత్రం అపారంగా ఉంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా నిన్నటి వరకు చూస్తే 200680 మంది కరోనా బారిన పడ్డట్లుగా తెలుస్తోంది. 8092 మంది మృతి చెందినట్లుగా అధికారిక సమాచారం అందుతోంది. ఈ సంఖ్య ఒకటి రెండు రోజుల్లో పది వేలకు చేరుతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా యూరప్‌ లో పరిస్థితులను అదుపులో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఇండియాలో కూడా కరోనా వ్యాప్తి ఊహించినదానికంటే ఎక్కువగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా బాధితులు మృతులు నమోదు అయ్యారు.