Begin typing your search above and press return to search.
చాప కింద నీరులా కరోనా కొత్త వేరియంట్.. 5 రాష్ట్రాల్లో కేసులు!
By: Tupaki Desk | 21 Oct 2022 6:25 AM GMTగత రెండేళ్లు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది.. కరోనా. దీని ధాటికి కొన్ని కోట్ల మంది బలయ్యారు. మరెన్నో కోట్ల మంది చచ్చి బతికారు. ఇప్పటికీ ఎంతోమంది కరోనా సృష్టించిన సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమయ్యాయి. కోవిడ్ లాక్‌డౌన్‌లతో వ్యాపారాలు నిలిచిపోవడంతో ఆయా దేశాల ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. అయితే వ్యాక్సిన్ల రాకతో కోవిడ్‌కు చాలా వరకు అడ్డుకట్ట పడింది.
అయితే.. వ్యాక్సిన్లకు కూడా లొంగకుండా కోవిడ్ మహమ్మారి రూపు మార్చుకుని కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్ చాప కింద నీరులా విస్తరిస్తోంది.
ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్ అంటే.. బీఏ.2.75, బీజే.1ల రీకాంబినెంట్. శాస్త్రీయ నామం బీఏ.2.10. ఈ వేరియెంట్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సింగపూర్‌లో గత కొన్నిరోజులుగా ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కేసులు రెట్టింపు సంఖ్యలో వెలుగు చూశాయి. సింగపూర్‌లో ఒక్కరోజులోనే 4,700 నుంచి 11,700 కేసులు పెరిగాయంటే తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అత్యంత వేగంగా ఇన్‌ఫెక్షన్‌ను వ్యాపించే గుణం ఈ వేరియెంట్‌కు ఉందని పరిశోధకులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ కేసులు మన దేశంలో ఐదు రాష్ట్రాల్లో వెలుగు చూడటం గమనార్హం. ఈ ఐదు రాష్ట్రాల్లో 70 ఎక్స్‌బీబీ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళ, ఇతర ప్రాంతాల్లో ఈ వేరియెంట్‌కు సంబంధించిన కొత్త కేసులు వెలుగు చూడటం మళ్లీ అందరిలోనూ ఆందోళనను రేపుతోంది. ఈ వేరియంట్ విజృంభిస్తే పోతే మూడు నుంచి నాలుగు వారాల్లో కేసులు మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక గుజరాత్‌లో ఇప్పటికే బీఏ.5.1.7, బీఎఫ్.7 కేసులు బయటపడ్డాయి. ఇవి కూడా వైరస్‌ను వేగంగా వ్యాపింపజేసే గుణం ఉన్న వేరియెంట్లే కావడం గమనార్హం.
కాగా ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్ తీవ్రత ప్రమాదకరమేమీ కాదని వైద్యులు చెబుతున్నారు.. కరోనా తరహా దగ్గు, లో ఫీవర్, జలుబు, వాసనను గుర్తించలేకపోవడం, ఒళ్లు నొప్పులు.. ఇలా కరోనా తరహాలోనే లక్షణాలే ఉంటాయని చెబుతున్నారు.
ఒకవేళ ఎక్స్‌బీబీ సోకినా మంచి చికిత్సతో తొందరగానే కోలుకోవచ్చని వివరిస్తున్నారు. అయితే దాని గుణం వల్ల ఇన్‌ఫెక్షన్‌ను అతిత్వరగా, వేగంగా వ్యాప్తి చేస్తోందని అంటున్నారు. దీనివల్ల ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కాగా ఒమిక్రాన్ ఎక్స్‌బీబీని ఆగస్టులో ముందుగా అమెరికాలో గుర్తించారు. ఎక్స్‌బీబీ వేరియెంట్‌పై వ్యాక్సినేషన్ ప్రభావం పెద్దగా ఉండదని అంటున్నారు. ఎందుకంటే దాని మ్యూటేషన్ అంతుచిక్కకపోవడమే కారణమని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కూడా ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్‌పై స్పందించారు. పండుగ సీజన్ దృష్ట్యా భారత్ సహా మరికొన్ని దేశాల్లో ఇది విజృంభించొచ్చని హెచ్చరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.