Begin typing your search above and press return to search.

కరోనా వ్యక్తి ఆస్పత్రి నుంచి పరార్..షాకైన డాక్టర్లు

By:  Tupaki Desk   |   5 March 2020 9:45 AM GMT
కరోనా వ్యక్తి ఆస్పత్రి నుంచి పరార్..షాకైన డాక్టర్లు
X
దగ్గు, జలుబు, జ్వరం ఉంటే అవి కరోనా లక్షణాలుగా పేర్కొంటున్నారు. అంతేగానీ అవి వచ్చినవారంతా కరోనా వైరస్ సోకిందని కాదు. అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సాధారణంగా అనారోగ్యానికి గురవుతారు. ఇటీవల దగ్గు, జలుబు, జ్వరం సాధారణంగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ వచ్చిన వారంతా ఆందోళన చెందతున్నారు. తమకు కరోనా వ్యాపించిందని ఆందోళన చెందుతూ ఆస్పత్రుల బాట పడుతున్నారు. వారిలో చాలామందికి కరోనా లేదు. అయితే ఇలాంటి లక్షణాలున్న వారికి ప్రత్యేక పరీక్షలు చేసి వైద్యులు నిర్ధారిస్తున్నారు. పంజాలో ఇదే మాదిరి ఓ వ్యక్తి పరీక్షలు చేస్తుండగా తనకు కరోనా వైరస్ వ్యాపించిందనే భయంతో ఆస్పత్రి నుంచి పరరాయ్యాడు. ఈ హఠత్పరిణామానాకి వైద్యులు నివ్వెర పోయారు.

దుబాయ్ నుంచి పంజాబ్ కు తిరిగి వచ్చిన ఓ వ్యక్తి దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. పరీక్షల నిమిత్తం మోగాలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే వైద్యులు అతడికి అతడికి పలు పరీక్షలు చేసి కరోనా వైరస్ ఉన్నట్లు కేవలం అనుమానించి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించాలని నిర్ణయించారు. అయితే ఒక్కసారిగా అతడు భయపడ్డాడు. తనకు కరోనా వైరస్ వ్యాపించిందనే భయాందోళనతో ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. కేవలం శాంపిల్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన జంకుకుని వెళ్లిపోయాడు. అయితే కొన్ని గంటల తర్వాత అతడు మళ్లీ ఆస్పత్రికి వచ్చాడు. కరోనా వైరస్ గురించి అవగాహన పెంచుకుని వైద్యులు సహకరించేందుకు వచ్చాడు. తిరిగి వచ్చి ఆస్పత్రిలో పూర్తి శాంపిల్స్ ఇచ్చాడు. అయితే దీనికి గల కారణాల ఆ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

కొందరు మీడియా వ్యక్తులు అతడిని ఫొటోలు తీయడంతో ఐసోలేషన్ వార్డులో చేరేందుకు నిరాకరించాడంట. అప్పుడు కొంతమంది వైద్యులు, స్థానిక పోలీసులతో కలిసి అతడి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఒప్పించడంతో ఆ వ్యక్తి మళ్లీ ఆస్పత్రికి వచ్చి మిగతా శాంపిల్స్ ఇవ్వడమే కాకుండా అడ్మిట్ కావడానికి కూడా అంగీకరించినట్లు వైద్యులు తెలిపారు. అతడి నమూనాలు పరిశీలించగా అతడిలో న్యూమోనియా లక్షణాలు ఉన్నట్లు తేలింది. కరోనా వైరస్ పరీక్ష కోసం అతని శాంపిల్స్‌ను పూణే ల్యాబ్‌కు పంపించారు. ఊరికే కంగారు పడడంతో నానా హైరానా చేశాడని వైద్యులు అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మనచోట కూడా జరుగుతున్నాయి. వైద్యులకు పూర్తిగా సహకరిస్తే ఎలాంటి వ్యాధి అయినా ఇట్టే తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే వైద్యుల వద్ద ఎప్పుడు అబద్ధం ఆడొద్దని చెబుతుంటారు.