Begin typing your search above and press return to search.

శాఖాహారుల్లో కరోనా తక్కువ? కొత్త అధ్యయనం చెప్పిన నిజం

By:  Tupaki Desk   |   26 Jan 2021 11:00 AM IST
శాఖాహారుల్లో కరోనా తక్కువ? కొత్త అధ్యయనం చెప్పిన నిజం
X
రోనాకు సంబంధించిన కొత్త విషయాల్ని తాజాగా ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. కొన్ని బ్లడ్ గ్రూపుల వారిపైన కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లుగా తేలటంతో పాటు.. నాన్ వెజ్ తో పోలిస్తే.. వెజిటేరియన్లలో కోవిడ్ వ్యాప్తి తక్కువగా ఉందన్న విషయం వెల్లడైనట్లుగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వెల్లడిస్తోంది. కరోనా వ్యాప్తి ఎలా ఉందన్న విషయాన్ని దేశ వ్యాప్తంగా 17 నగరాల్లో అధ్యయనం చేయగా.. కీలక విషయాలు వెల్లడైనట్లుగా తెలుస్తోంది.

ఈ సంస్థ పరిధిలో దేశ వ్యాప్తంగా 32 ప్రయోగశాలలు ఉన్నాయి. అందులో సీసీఎంబీ.. ఐఐసీటీ.. ఎన్ జీ ఆర్ లాంటి చాలా సంస్థలు ఉన్నాయి. ఇందులో పని చేసే శాస్త్రవేత్తల నుంచి.. వారి కుటుంబ సభ్యుల నుంచి 10,427 మందిపై అధ్యయనం చేశారు. వీరిలో యాంటీబాడీ పరీక్షలు నిర్వహించారు. అధ్యయనం చేసిన వ్యక్తుల్లో అప్పటికే 10 శాతం మంది కోవిడ్ బారిన పడి కోలుకున్నట్లు తేలింది. 346 మందిలో మూడు నెలల తర్వాత.. 45 మందిలో ఆరు నెలల తర్వాత యాంటీబాడీలు డెవలప్ అయినట్లు గుర్తించారు.

జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లోనూ.. వ్యక్తిగత వాహనాలతో పోలిస్తే.. నలుగురైదుగురు కలిపి వెళ్లే వాహనాల్లో ప్రయాణించిన వారే ఎక్కువగా కరోనా బారిన పడినట్లుగా గుర్తించారు. అంతేకాదు.. శాఖాహారాల్లో 6.8 శాతం కోవిడ్ బారిన పడితే.. నాన్ వెజిటేరియన్లలో 11 శాతం వరకు వైరస్ వ్యాప్తిని గుర్తించారు. బ్లడ్ గ్రూపుల్లో ‘‘ఎ’’ గ్రూపులో ఉన్న వారిలో వైరస్ రేటు ఎక్కువగా ఉండగా.. ‘ఒ’ గ్రూపు వారిలో తక్కువగా ఉండగా.. ‘బి’ గ్రూపు వారు మధ్యలో ఉన్నట్లుగా గుర్తించారు. అయితే.. ఇవన్నీ వాస్తవాలు అని చెప్పటం లేదు కానీ.. కోవిడ్ ఎలాంటి వారిలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని గుర్తించేందుకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.