Begin typing your search above and press return to search.

శ్మశానంలో కరోనా 'ఐసోలేషన్' ... ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   18 May 2021 6:30 AM GMT
శ్మశానంలో కరోనా ఐసోలేషన్ ... ఎక్కడంటే ?
X
దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం కొనసాగుతుంది. ప్రతి రోజు కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. అయితే కేసుల్లో రోజురోజుకి తగ్గుదల కనిపిస్తున్నా కూడా , మరణాల సంఖ్యల్లో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ప్రతి రోజు నాలుగు వేల మందికి పైగా కరోనా కాటుకి బలైపోతున్నారు. ఇక కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ కరోనా నుండి తమ తమ గ్రామాలని రక్షించుకుంటున్నారు. తాజాగా కరోనా కట్టడి లో భాగంగా తమ గ్రామస్థులు కరోనా భారిన పడితే , వారికి శ్మశానం లో ఐసోలేషన్ ఏర్పాటు చేసారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మహబూబ్‌ నగర్‌ జిల్లా నవాబుపేట మండలం కిష్టంపల్లి తండావాసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా కొత్తగా నిర్మించిన శ్మశానాన్ని ఐసోలేషన్‌ కేంద్రంగా ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తండావాసులంతా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని పకడ్బందీగా కరోనా నియమాలు అమలు చేస్తున్నారు. మొత్తం 360 మంది జనాభా ఉన్న ఈ తండాలో ఫస్ట్ ఇద్దరికి కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయింది. కరోనా వైరస్‌ మహమ్మారి వాప్తి చెందితే, గ్రామంలోని వారికి మరింత ప్రమాదం ముంచుకొస్తుందని భావించి , గ్రామంలోని ప్రతి ఒక్కరు కోవిడ్‌ నిర్ణారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆరుగురు వైరస్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం వీరందరూ ఆ స్మశానంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. నాలుగు రోజులుగా అక్కడే ఐసోలేషన్‌లో ఉండగా.. మొదట్లో తండావాసులు రెండు పూటలా భోజనం సమకూర్చారు. ప్రస్తుతం రుద్రారానికి చెందిన యువత వీరికి నిత్యం ఆహారం సమకూరుస్తూ సేవలందిస్తోంది. అక్కడ ఉంటున్న కరోనా పాజిటివ్‌ బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు కిష్టంపల్లి సర్పంచ్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు.