Begin typing your search above and press return to search.

చిన్నపిల్లలకు కరోనా రావడం లేదు.. కారణం ఇదే!

By:  Tupaki Desk   |   10 Nov 2020 5:00 AM IST
చిన్నపిల్లలకు కరోనా రావడం లేదు.. కారణం ఇదే!
X
కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం తలకిందులవుతున్నది. ఇతర వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్​వో మొదటి నుంచి సూచిస్తూ వస్తున్నది. అయితే భారత్​ సహా చాలా దేశాల్లో చిన్నిపిల్లలకు ఈ వ్యాధి సోకడం లేదు. కరోనాతో పిల్లలు చనిపోయిన ఘటనలు కూడా చాలా తక్కువ. చిన్న పిల్లల విషయంలో కుటుంబసభ్యులు జాగ్రత్తగా ఉండటం వల్లే ఈ మహమ్మారి వారికి సోకడం లేదని మొదట్లో భావించారు. కానీ ప్రస్తుతం మరో ఆసక్తికర విషయం బయటపడింది. పిల్లలో యాంటీ బాడీలు ఎక్కుగా ఉంటున్నాయట. మాములుగా కరోనా వంటి వైరస్​ సోకినప్పుడు మనిషి శరీరంలో యాంటీబాడీలు ఉత్పన్నం అవుతుంటాయి. కానీ అందుకు విరుద్ధంగా చిన్నపిల్లలకు కరోనా సోకకపోయిన వారిలో యాంటీబాడీస్​ పుడుతున్నాయట. ఈ కారణం చేతే వారికి కరోనా సోకడం లేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చిన్నపిల్లల్లో చాలా మందిలో కరోనా వైరస్​ యాంటీబాడీలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు సైన్స్ అనే పత్రికలో ఓ అధ్యయనం ప్రచురితమైంది.

శాస్త్రవేత్తలు కోవిడ్​యాంటీబాడీలపై పరిశోధన చేస్తున్న క్రమంలో ఈ విషయం బయటపడింది. యాంటీబాడీల గురించి పరిశోధన చేసేందుకు కోవిడ్​ సోకినవారిది, కోవిడ్​ సోకనివారి రక్తాన్ని తీసుకొని పరిశోధన సాగిస్తుంటారు. ఈ క్రమంలో పలువురు చిన్నపిల్లలకు కోవిడ్​ సోకకపోయినా వారిలో కోవిడ్​ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పన్నం కావడం శాస్త్రవేత్తలు గమనించారు. మొత్తం 300 రక్త నమూనాలను సైంటిస్టులు పరిశీలించారు. దాదాపు అన్ని బ్లడ్ శాంపిళ్లలోనూ సాధారణ జలుబుని కలిగించే కరోనా వైరస్ ని ఎదుర్కొనే యాంటీ బాడీలు ఉండటం పరిశోధకులు గుర్తించారు. అయితే దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని వారు చెబుతున్నారు. ఇంపీరియల్ కాలేజి లండన్, యూనివర్శిటీ కాలేజి లండన్ ప్రస్తుతం ఈ తరహా పరిశోధనలు సాగిస్తున్నది.