Begin typing your search above and press return to search.

కరోనా ఊపిరితిత్తులకే కాదు.. ఇతర అవయవాలకు హానికరమే

By:  Tupaki Desk   |   8 July 2021 7:00 AM IST
కరోనా ఊపిరితిత్తులకే కాదు.. ఇతర అవయవాలకు హానికరమే
X
కరోనా సృష్టించిన ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ఇటు ఆర్థిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, ఇతర ముఖ్యమైన వ్యవస్థలను అతలాకుతలం చేసింది. ప్రతీ దేశ ఆరోగ్య రంగానికి ఒక సవాల్ విసిరింది. ప్రతీ దేశంలో ఆ దేశ జనాభాకు సరిపడే వైద్య సదుపాయాలు లేవనే నిజాన్ని పాలకులు ఒప్పుకునేలా చేసింది.

అత్యంత తక్కువ సమయంలోనే హాస్పిటల్ నిర్మించుకునే టెక్నాలజీ, సామర్థ్యం ఉన్న దేశాలు వెంట వెంటనే పెద్ద పెద్ద హాస్పిటళ్లు నిర్మించుకున్నాయి. లేని దేశాలు మాత్రం ఇబ్బంది పడ్డాయి. మన దేశం కూడా తాత్కాలికంగా, సత్వరంగా కొన్ని చర్యలు చేపట్టింది. టెంపరరీ హాస్పిటల్స్ను ఏర్పాటు చేసింది. బెడ్ల సామర్థ్యం పెంచింది. విశాలంగా ఉన్న కొన్ని భవనాలను హాస్పిటల్స్ గా మార్చేసింది. మన దగ్గర ఉన్న అతి పెద్ద వనరు అయిన రైల్వేస్ను చాలా బాగా ఉపయోగించుకుంది. చాలా రైళ్లను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేసింది. ప్రతీ బోగిలో కొన్ని బెడ్స్, ఆక్సిజన్, ఇతర అవసరమైన సదుపాయాలన్నీ సమకూర్చింది.

ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో ఇండియా మొదటి వరుసలో ఉంటుంది. అందుకే మన దగ్గర కోవిడ్ను నిలువరించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలన్నీ చాలా కష్టపడ్డాయి. ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా అదుపులోకి వస్తోంది. కరోనా సోకిన వారి కంటే కరోనా నుంచి కోలుకుంటున్నవారే అధికంగా ఉంటున్నారు. ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

కరోనా సోకిన తగ్గిన వారిలో కొందరిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. కానీ కరోనా ట్రీట్మెంట్ సమయంలో స్టెరాయిడ్స్ వాడిన వారి పరిస్థితి మాత్రం తరువాత ఇబ్బందికరంగా మారింది. బీపీ, షుగర్, ఇతర ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి, ట్రీట్మెంట్లో స్టెరాయిడ్స్ వాడిన వారికి బ్లాక్ ఫంగస్ ఎటాక్ చేసింది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్తో చాలా మంది ఇబ్బంది పడ్డారు. చాలా మంది దాని నుంచి కూడా సురక్షితంగా కోలుకున్నారు.

అయితే కరోనా విషయంలో శాస్త్రవేత్తల తాజా నివేదిక ఒకటి బయటపెట్టారు. కరోనా సోకిన వారిలో ఇతర అవయవాలు పాడైపోవడానకి గల కారణాలను తాము కనుక్కున్నామని తెలిపారు. ప్రతీ అవయవం యొక్క కణాలకు కొంత శక్తి కావాల్సి ఉంటుంది. అయితే కరోనా వైరస్ ఆ శక్తిని తయారు చేసుకోనివ్వడం లేదని తెలిపారు. ఫలితంగా అవయాలు సరిగా పని చేయడం లేదని పేర్కొన్నారు. ఇది తాము ఎలకలపై చేసిన ప్రయోగంలో పరీక్షించామని తెలిపారు. తొలుత ఎలుకలకు కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ చేసినప్పుడు, ఒక వారం రోజుల తరువాత అవి తినడం మానేశాయని తెలిపారు. తద్వారా వాటి బరువులో తగ్గుదల తాము స్పష్టంగా గమనించామని చెప్పారు. అయితే ఈ ప్రయోగం ద్వారా తాము కరోనా వైరస్ నుంచి అవయవాలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు.

ఇప్పటికే కరోనా నెగటివ్‌ వచ్చిన తర్వాత అనేక సమస్యలు తలెత్తుతాయి అంటూ నిర్థారించడం జరిగింది. ఇప్పుడు ఈ సమస్య ను కూడా శాస్త్రవేత్తలు గుర్తించడం తో ఆంతోళన వ్యక్తం అవుతోంది. అందుకే సాద్యం అయినంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు దాన్ని పూర్తిగా దూరంగా ఉంచేందుకు మాస్క్ మరియు సామాజిక దూరం పాటించాల్సిందే అంటూ నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం విషయంలో కనీసం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అన్ని విధాలుగా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందే అంటూ నిపుణులు అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా నూరు శాతం ప్రభావం కనిపించడం లేదు. కనుక తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుని కరోనాకు ఆ తర్వాత పరిణామాలకు దూరంగా ఉండటం మంచిది.