Begin typing your search above and press return to search.
తెలంగాణలో 12 శాతం మందికి కరోనా సోకింది : ఐసీఎంఆర్
By: Tupaki Desk | 2 Oct 2020 3:00 PM ISTతెలంగాణలో రెండో సారి నిర్వహించిన ఐసీఎంఆర్ యాంటీబాడీస్ టెస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో తెలంగాణ ప్రజల్లో యాంటీబాడీస్ బాగా పెరిగాయని తేలింది. 0.5 శాతం నుంచి 18.2 శాతానికి యాంటీబాడీస్ పెరిగింది. తెలంగాణలో సగటున 12 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్దారించారు. జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 1300 మందికి యాంటీబాడీ టెస్టులు చేశారు. జనగామలో 18 శాతం, కామారెడ్డిలో 6.9శాతం, నల్గొండలో 11.1 శాతం పాజిటివ్ వచ్చింది. కరోనా వ్యాప్తి నెమ్మదిగా జరుగుతుందని ఐసీఎంఆర్-ఐఎన్ ఎన్ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల కోసంచాలా రాష్ట్రాలు ఆర్టీ- పీసీఆర్ పద్దతిని అవలంబిస్తున్నాయి. వ్యక్తుల నుండి సేకరించిన శాంపిళ్ళలో కరోనా ఉనికిని గుర్తిస్తుంది. దీనినే యాంటిజెన్ పరీక్ష కూడా అంటారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఇది వైరస్ ను గుర్తిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ యాంటీబాడీస్ పరీక్షలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మనిషిలో రోగ నిరోధక శక్తి ఎంత ఉందో తెలుసుకోవడానికే యాంటీ బాడీ టెస్ట్ నిర్ధారిస్తుంది. భారత్ లో కరోనా ఇప్పటికే 198 రకాలుగా రూపాంతరం చెందినట్టుగా జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు వెల్లడించారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో కూడా జూన్ నాటికి ఈ వైరస్ 55 రకాలుగా రూపాంతరం చెందిందని తెలిపారు.
ఇప్పటికే ఒక హైదరాబాద్ నగరంలోనే 6 లక్షల మంది కరోనా బారిన పడ్డారని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ గతంలోనే వెల్లడించింది. దాదాపు నగర జనాభాలో 6 శాతం మందికి వైరస్ సోకినట్లు స్పష్టమవుతుంది. కానీ, వీరిలో ఎలాంటి లక్షణాలు లేని వారే అధికంగా ఉన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం తెలంగాణాలో నమోదైన కరోనా కేసులు 1,95,609 మాత్రమే. మనుషుల శరీరంలోకి ఏదైనా విషం చేరినా, కరోనా లాంటి వైరస్, బాక్టీరియా ప్రవేశించినా మన శరీరం 14 రోజుల వ్యవధిలో యాంటీబాడీలను విడుదల చేస్తుంది. వీటిలో మరో రకం యాంటీబాడీస్ మాత్రం ఇన్పెక్షన్ సోకిన వారం రోజులకు బయటపడుతుంది. ఈ యాంటీబాడీస్ పరీక్షలో పాజిటివ్ గా తేలితే ఆ వ్యక్తికి 15 నుంచి 21 కరోనా వచ్చి వెళ్లినట్టుగా గుర్తిస్తారు. ఇవి శరీరంలో ఉంటే అతనికి మళ్ళీ కరోనా సోకే అవకాశాలు పెద్దగా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఐసీఎంఆర్ తాజాగి నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు సమాచారం.