Begin typing your search above and press return to search.

అమెరికాలో ప్రతీ ఐదుగురిలో ఒకరికి కరోనా!

By:  Tupaki Desk   |   10 Sept 2020 5:20 PM IST
అమెరికాలో ప్రతీ ఐదుగురిలో ఒకరికి కరోనా!
X
ప్రపంచంలోనే కరోనాతో ఎక్కువగా ప్రభావితమైన దేశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా అమెరికానే.. చైనాలో పుట్టిన మహమ్మారి ధాటికి అమెరికా అతలాకుతలమైంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ చైనీస్ వైరస్ పై మండిపడుతుంటారు. చైనాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కాగా ప్రపంచంలోనే అత్యధిక కరోనా తీవ్రత అమెరికాలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమెరికాలోని ప్రతీ ఐదుగురిలో ఒకరికి కరోనా సోకే ప్రమాదం ఉందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్.డీ.ఏ) మాజీ చీఫ్ స్కాట్ గాట్లిబ్ సంచలన విషయాన్ని చెప్పారు. రాబోయే శీతాకాలంలో మరింత ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికా దేశ జనాభాలో దాదాపు 20శాతం మంది కరోనా బారినపడుతున్నారని అంచనా వేశారు. మాస్కులు ధరించడం.. భౌతిక దూరం పాటించడం లాంటి చర్యలతో ప్రజలు విసుగు చెందడం వల్లే కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.