Begin typing your search above and press return to search.

ట్యూషన్ కు వెళ్లిన 15మంది విద్యార్థులకు కరోనా

By:  Tupaki Desk   |   2 Oct 2020 12:00 PM IST
ట్యూషన్ కు వెళ్లిన 15మంది విద్యార్థులకు కరోనా
X
కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. ఇంటినుంచి బయట కాలు పెట్టడమే ఆలస్యం సోకుతోంది. ఇప్పటికే కరోనాతో అన్ని మూతపడ్డాయి. చదువులు అటకెక్కాయి. ట్యూషన్ల ద్వారా అయినా నెట్టుకొద్దామని చూసిన వారికి తాజాగా షాక్ తగిలింది.

తాజాగా గుంటూరు జిల్లాలో ప్రైవేట్ క్లాసులు కొంపముంచాయి. మాస్టర్ కు కరోనా సోకడంతో ట్యూషన్ కు వెళ్లిన 15 మంది విద్యార్థులు కరోనా బారినపడడం కలకలం రేపింది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరులో 15మంది చిన్నారులకు కరోనా సోకిందని వైద్యాధికారులు వెల్లడించారు. ట్యూషన్ చెప్పే మాస్టార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన వద్దకు ట్యూషన్ కు వెళ్లిన విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 15మంది విద్యార్థులు కరోనా పాజిటివ్ బారిపడ్డారు.

దారుణమైన విషయం ఏంటంటే.. విద్యార్థులంతా ఏడేళ్లలోపు చిన్నారులే కావడం మరింత కలిచివేస్తోంది. విద్యార్థులను అధికారులు ఎన్ఆర్ఐ క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. చిన్నారుల తల్లిదండ్రుల్లో కూడా కొందరికీ కరోనా పాజిటివ్ గా రావడంతో అధికారులు గ్రామంలో శానిటైజ్ చేశారు.

ఇక కరోనా లక్షణాలున్న విద్యార్థుల తల్లిదండ్రులను క్వారంటైన్ లో ఉంటూ చికిత్సలు చేస్తున్నారు.