Begin typing your search above and press return to search.

కరోనా ఫుడ్: కోడిగుడ్డుపై అసలు నిజం బయటపెట్టారు

By:  Tupaki Desk   |   24 July 2020 5:00 AM IST
కరోనా ఫుడ్: కోడిగుడ్డుపై అసలు నిజం బయటపెట్టారు
X
అసలే ఇది కరోనా టైం.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే సంపూర్ణ ఆహారం తీసుకోవాలి. కోడి గుడ్డు.. మనకు దొరికే ఆహార పదార్థాల్లో అన్ని పోషకాలున్న సంపూర్ణ ఆహారం.. కరోనాతో చికిత్స పొందుతున్న వారందరికీ రోజుకు ఒకటి లేదా రెండు కోడిగుడ్లను పెడుతున్నారని వాళ్లే స్వయంగా తెలిపారు. అందుకే మన ప్రభుత్వం, పోషాకాహార నిపుణులు రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యం మీ వెంటే అని సూచిస్తున్నారు.. గుడ్డు తింటే మంచిదే.. కానీ కొందరు బ్రాహ్మణులు కానీ.. నాన్ వెజ్ ప్రియులకు ఓ ధర్మ సందేహం ఎన్నాళ్లనుంచో వెంటాడుతోంది. ఇంతకీ కోడిగుడ్డు వెజ్జా.. లేక నాన్ వెజ్జా..? ఈ ప్రశ్నకు ఎవ్వరూ ఖచ్చితమైన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది..

చాలామంది శాకాహారులు గుడ్డును మాంసాహారంగా భావించి దానిని తినరు. వారి అభిప్రాయంలో నాన్‌వెజ్ కేటగిరీకి చెందిన కోడి... ఈ గుడ్డును పెడుతుంది. ఈ కారణంగానే దీనిని నాన్‌వెజ్‌గా భావిస్తారు. అలా అయితే పశువుల నుంచి వచ్చే పాలు శాకాహారం ఎలా అవుతుందనేది నాన్‌వెజ్ ప్రియుల ప్రశ్న. ఈ ప్రశ్నల సంగతి అలా ఉంచితే.. గుడ్డులో మాత్రం ఎన్నో రకాల మంచి పోషకాలున్నాయి..

గుడ్డులోని తెల్లని భాగంలో ప్రొటీన్లుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానిలో ఎంటువంటి జంతు పదార్థం ఉండదు. అంటే ఎగ్‌వైట్ శాకాహారమని తేల్చిచెప్పారు. ఇక పచ్చసొన విషయానికొస్తే దానిలో అత్యధికంగా ప్రొటీన్లు, కోలెస్ట్రాల్ ఉంటుంది. అయితే మరో కోడితో సంపర్కం జరిగినప్పుడే ఇది మాంసాహారంగా మారుతుంది. కోడి జన్మించిన ఆరు నెలల తరువాత ఒకటి లేదా రెండు రోజులకు గుడ్డును పెడుతుంది. అయితే ఈ ప్రక్రియ కోడిపెట్ట లేదా పుంజుతో సంపర్కం అవసరం లేకుండానే జరుగుతుంది. కాబట్టి గుడ్డు శాఖాహారమని కొందరు వాదిస్తున్నారు.. ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా.. ఎన్నో పోషకాలున్న గుడ్డును ఇలా నాన్ వెజ్ పేరు తో పక్కకు పెడితే.. ఆ సంపూర్ణ ఆహారానికి మీరు దూరమైనట్టే..