Begin typing your search above and press return to search.

ఆ తేనెతో కరోనా ప్రమాదం మరింత ముంచుకొచ్చినట్లేనట

By:  Tupaki Desk   |   5 Dec 2020 5:00 AM IST
ఆ తేనెతో కరోనా ప్రమాదం మరింత ముంచుకొచ్చినట్లేనట
X
పొద్దుపొద్దున్నే లేచి.. గోరువెచ్చటి నీళ్లలో కాసింత తేనె.. మరికాస్తా నిమ్మరసం వేసుకొని తాగితే ఒంటికి జరిగే మంచి అంతా ఇంతాకాదు. ఆరోగ్యం చక్కగా ఉండాలంటే ఈ చిన్న చిట్కా పాటించండంటూ జరిగిన ప్రచారానికిచాలామంది ఇవాల్టి రోజున పొద్దున్నే తేనెనీళ్లను వాడేస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ బ్రాండ్ల తేనెను విపరీతంగా వాడేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తేనె పేరుతో కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న మోసాల గురించి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) షాకింగ్ నిజాన్ని వెల్లడించటం తెలిసిందే.

తాము పదమూడు కంపెనీల శాంపిల్స్ తీసుకొని లోతుగా అధ్యయనం చేస్తే.. పది కంపెనీలకు చెందిన తేనె కల్తీమయమని.. కేవలం మూడు కంపెనీలు మాత్రం ప్రమాణాల్ని పాటిస్తున్నట్లుగా పేర్కొంది. ఈ రిపోర్టు షాకింగ్ గా మారటమే కాదు.. పెను సంచలనంగా మారింది. ఈ రిపోర్టులో పేర్కొన్న దానిప్రకారం ప్రధాన బ్రాండ్లుగా భావించే డాబర్.. పతంజలి.. బైద్యనాథ్ జండుతో సహా మొత్తం పది బ్రాండ్ల తేనె కల్తీ అని.. అందులో చాలా తెలివిగా చైనా షుగర్ ను కలుపుతున్నట్లుగా సీఎస్ఈ వెల్లడించింది.

కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు తేనెకు బదులుగా ఎక్కువగా పంచదార తినటం కారణంగా ప్రమాదానికి అవకాశం ఉందని భావిస్తుంటే.. తాజాగా తేనెలోనూ షుగర్ ల్విక్విడ్ ఉండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అయితే.. ఈ నివేదికను కంపెనీలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రిపోర్టు అవాస్తవమైనదని.. దేశీయ తేనె కంపెనీల్ని దెబ్బ తీయటం కోసం కుట్ర సాగుతుందన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.

వీరి వాదనలపై సీఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నరేన్ మాట్లాడుతూ.. కోవిడ్ 19 సమయంలో తేనె అమ్మకాలు పెరిగిప్పటికి.. ఉత్తర భారతంలోని తేనెటీగ పెంపకందారుల లాభాలు తగ్గిపోవటంతో తాము దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. కూల్ డ్రింక్స్ పై 2003.. 2006లో తాము చేపట్టిన పరిశోధనలో బయటపడిన వాస్తవాల కంటే కూడా తాజా దుర్మార్గం ఘోరమైనది అంటున్నారు.

ఈ అధునాత కల్తీని ఆమె తప్పుపట్టారు. ఇప్పటివరకు తాము గుర్తించిన వాటిల్లోకెల్లా ఇదే పరమ దారుణమైన కల్తీగా ఆమె అభివర్ణిస్తున్నారు. మరోవైపు నిఫుణులు ఈ అంశంపై స్పందిస్తున్నారు. తేనెలో కల్తీని గుర్తించటం కష్టమని ఫుడ్ సేఫ్టీ అండ్ టాక్సిన్స్ టీం ప్రోగ్రామ్ డైరెక్టర్ అమిత్ ఖురానా వెల్లడించారు. తేనె కల్తీని గుర్తించేందుకు ప్రత్యేకంగా న్యూక్లియర్ మాగ్నెటిక్ రెస్సొనెన్స్ అనే పరీక్ష ద్వారా మాత్రం అసలు.. నకిలీని తెలుసుకునే వీలుందని చెబుతున్నారు. ఈ సంస్థ చేసిన పరీక్షల్లో నెగ్గిన బ్రాండ్ల విషయానికి వస్తే.. సఫోలా.. మారికో.. మార్కె ఫెడ్ సోహ్నా.. నేచర్ నెక్టా మాత్రమే అర్హత లభించాయి. ఇంకోవైపు కల్తీ ఆరోపణలు ఎదుర్కొంటున్నకంపెనీలు మాత్రం ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టి పారేస్తుంది.