Begin typing your search above and press return to search.
కరోనా సోకిందని దంపతుల ఆత్మహత్య
By: Tupaki Desk | 13 Nov 2020 1:40 PM ISTభయపడుతూ బతికే మనిషికి అల్సర్ కూడా ప్రాణాంతకమే అవుతుంది. తెగించి కొట్లాడేవాడికి కేన్సర్ కూడా చిన్నది అవుతుంది. మనో ధైర్యమే ఈ రోగాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. అది కోల్పోతే ప్రాణాలు తీస్తుంది.
‘దెయ్యం కంటే భయం మా చెడ్డది’ అని ఓ హర్రర్ మూవీలో పాపులర్ డైలాగ్ ఒకటి ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ప్రాణాలు తీస్తున్న కరోనా అంటే ఇప్పుడు జనం భయపడుతున్నారు. హడలి చస్తున్నారు. ఆ భయమే వారి ప్రాణాలు తీస్తోంది. కరోనా భయంతో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో విషాదం నింపింది.
కరోనా సోకిన దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జగిత్యాల పట్టణంలోని శివవీధిలోని రాంబాబు (45), లావణ్య(40 లకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇంటి తలుపులు వేసుకొని ఎంత సేపటికి బయటకు వారు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు.. అద్దెకుంటున్న పక్కింటి వారు కిటీకీలోంచి చూశారు. ఇద్దరు దంపతులు ఉరివేసుకొని కనిపించారు. కరోనా భయంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. ఇంకేమైనా కారణాలున్నాయా అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.