Begin typing your search above and press return to search.
అంటార్కిటికా లో మొదలైన కరోనా కలకలం !
By: Tupaki Desk | 23 Dec 2020 12:54 PM ISTచైనాలోని వ్యూహన్ లో మొదలైన కరోనా బీభత్సం..ఆ తర్వాత మెల్లి మెల్లిగా ప్రపంచం మొత్తం పాకిపోయింది. అయితే , ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుంటే ఏకైక ఖండం అంటార్కిటికా మాత్రం కరోనా బారినపడలేదు. కానీ, ఇప్పుడు అంటార్కిటికా ఖండంలోనూ మొదటి సారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 36 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. చిలీ రీసెర్చ్ బేస్ సహా చిలీ ఆర్మీలోని 26 మంది సభ్యులు, 10 మంది నిర్వాహణ వర్కర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని స్పానిష్ మీడియా వెల్లడించింది. సకాలంలో నివారణ చర్యలు చేపట్టినట్టు చిలీ ఆర్మీ ఒక ప్రకటనలో, వెంటనే పిసిఆర్ పరీక్షలు చేయడంతో వైరస్ నియంత్రణకు సాధ్యపడిందని తెలిపింది.
రీసెర్చ్ బేస్ కు వచ్చిన ఓడలో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని నివేదించింది. పాజిటివ్ వచ్చిన 36 మందిని చిలీలోని పుంటా అరేనాస్ నగరానికి తరలించారు. ఐసోలేషన్ లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని నివేదించింది. ఈ ద్వీపంలోని 13 చిలీ స్థావరాలలో ఇదొకటి. కొత్త కరోనా కేసులు నమోదుకావడంతో అంటార్కిటిక్ లోని అన్ని ప్రధాన పరిశోధన ప్రాజెక్టులను నిలిపివేశారు. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల పరిశోధనలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఖండంలో శాశ్వత నివాసితులు లేరు.. 1,000 మంది పరిశోధకులు, ఇతర సందర్శకులు మాత్రమే ఈ ద్వీపంలో ఉన్నారని స్పానిష్ మీడియా తెలిపింది.
మార్చిలో, కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. అంటార్కిటిక్ లో మహమ్మారి ఒక పెద్ద విపత్తుగా మారే ప్రమాదం ఉందంటున్నారు. బలమైన గాలులు అతి శీతల ఉష్ణోగ్రతలతో, ఖండంలో ఇప్పటికే ప్రమాదకరంగా మారింది. అంటార్కిటికా కఠినమైన వాతావరణంలో గణనీయమైన మరణాలు నమోదయ్యాయి.