Begin typing your search above and press return to search.
ఓ కరోనా రేపు రా అనాల్న.? గ్రామాల్లో పుకార్లు
By: Tupaki Desk | 20 March 2020 4:00 PM ISTకరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు భారతదేశాన్ని కుదిపేస్తోంది. దీని దెబ్బకు ప్రజా జీవనం పూర్తిగా దెబ్బతింది. ఇక మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూతో దేశమంతా బోసిపోనుంది. ఒక్క చీమ కూడా ఆరుబయట కనిపించదు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలతో కలిసి చర్యలు చేపట్టనుంది. అయితే ఈ కరోనా వైరస్ పై పుకార్లు, అపోహాలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆ విషయాలు ప్రచారం అవుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గ్రామాల్లో మరో పుకారు హల్ చల్ చేస్తోంది.
గతంలో దయ్యాలు ఉన్నాయని భావించి ప్రతి ఇంటి తలుపుకు ఓ స్త్రీ రేపు రా అనేది రాసి పెట్టి ఉంచేవారు. దయ్యాలకు భయపడి అలా రాసుకునేవారు. అలా రాసుకుంటే దయ్యాలు తమ ఇంటికి రావని ఒక మూఢ నమ్మకం ఉండేది. ఇప్పుడు అది ఎక్కడా లేకపోయినా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మరోసారి చర్చకు వస్తోంది. ఆ దయ్యాల మాదిరి కరోనా కూడా రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఓ కరోనా రేపు రా అని రాసుకోవాలని తెలుగు రాష్ట్రాల్లో కొందరు సూచిస్తున్నారు. ఈ చర్చ పల్లెటూర్లలో తీవ్రంగా నడుస్తోంది. ఈ మేరకు కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని సమాచారం.
ఓ కరోనా రేపు రా అని తలుపుపై రాస్తే కరోనా వైరస్ తమ ఇంటికి రాదని వారు చెబుతున్న మాట. ఈ కాలంలో కూడా ఇలాంటి పుకార్లు రావడం గమనార్హం. ఇలాంటి పుకార్లు నమ్మవద్దని పోలీసులతో పాటు అధికారులు సూచిస్తున్నారు. మూఢ నమ్మకాలతో ప్రజలు భయాందోళన చెందుతారనే విషయం తెలియకుండా అలాంటి పోస్టులు, విషయాలు ప్రచారం చేయడం సరికాదని చెబుతున్నారు. అలాంటి ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఓ స్త్రీ రేపు రా అనే దాన్ని తొలగించిన మాదిరి ఇప్పుడు ఓ కరోనా రేపు రా అనే దానిపై తొలగిస్తామని పోలీస్ అధికారులు చెబుతున్నారు.