Begin typing your search above and press return to search.

జపాన్​ లో మరో మ్యుటేషన్​.. ఇంతకీ ఒలంపిక్స్​ జరుగుతాయా?

By:  Tupaki Desk   |   7 April 2021 12:30 AM GMT
జపాన్​ లో మరో మ్యుటేషన్​.. ఇంతకీ ఒలంపిక్స్​ జరుగుతాయా?
X
ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న.. కొత్త జన్యు రూపాలతో విజృంభిస్తున్నది. బ్రిటన్​ లో కొత్త వేరియంట్​ చాలా రోజులపాటు హడావుడి చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా వేరియంట్​ వచ్చింది. కొత్త వేరియంట్ల ఎఫెక్ట్​తో పలు దేశాల్లో లాక్​ డౌన్​ కూడా విధించారు. ఇదిలా ఉంటే మనదేశంలోనూ కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నది. దీంతో అక్కడ ఆంక్షలు అమలుచేస్తున్నారు.

ఇదిలా ఉంటే జపాన్​ లో ఓ కొత్త వేరియంట్​ ను వైద్యులు గుర్తించారు. ఈ ఏడాది అంటే మరో మూడు నెలల్లోనే జపాన్​లో ఒలంపిక్ గేమ్స్​ జరగబోతున్నాయి. ఈ క్రమంలో అసలు ఈ గేమ్స్​ జరుగుతాయా? లేదా? అన్న అనుమానం నెలకొన్నది. జపాన్​ లో అనేక కొత్త వేరియంట్లు అంటే జన్యుమార్పిడి చెందిన వైరస్​లు గుర్తించామని అక్కడి అధికారులు అంటున్నారు. వైరస్​ నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని కూడా ప్రధాని చెప్పారు. ఈ కొత్త వేరియంట్లు ఒలంపిక్స్​ కు భయాన్ని కలిగిస్తున్నాయి. ఒసాకాలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో టోక్యోను అలర్ట్ చేశారు. ఈ కొత్త జన్యుమార్పిడి చెందిన వైరస్​ కు ఈక్​ అనే పేరుపెట్టారు.

టోక్యోలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం కేసులను ఈక్​ వైరస్​ లుగా నిర్ధారించారు. గత ఆదివారం ఒక్క రోజే టోక్యోలో 355 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇవన్నీ ఈక్​ స్ట్రెయిన్​ యేనని అధికారులు గుర్తించారు. ఈ వేరియంట్, వేగవంతంగా విస్తరిస్తుందని భయపడుతున్నారు. ఒసాకా ప్రిఫెక్చర్లో ఆదివారం మొత్తం 594 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, రికార్డు స్థాయిలో 666 కేసులు నిర్ధారించబడిన ఒక రోజు తర్వాత ఈ కేసులు నమోదయ్యాయి.E484 ( ఈక్​) మ్యుటేషన్​ తో జపాన్​ వాసులు వణికిపోతున్నారు. ఈ మ్యుటేషన్​ పై కనీసం వ్యాక్సిన్​ అయినా పనిచేస్తుందా లేదా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.