Begin typing your search above and press return to search.
పెళ్లి కానీ ప్రసాదులకు కొండంత కష్టం!
By: Tupaki Desk | 7 Sept 2020 4:00 PM ISTదేశంలో పెళ్లికాని వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. గతంలో పెళ్లీడు వచ్చిందంటే చాలు వివాహం జరిపించేవారు. ఇప్పుడు లైఫ్ సెటిల్ మెంట్ పేరుతో కొంతమంది మంది పెళ్లిని ఆలస్యం చేస్తున్నారు. తీరా అంతా సెట్ అయ్యాక పెళ్లి చేసుకుందామనుకుంటే పిల్ల దొరకడం లేదు. ఈ క్రమంలో కొందరు బ్రహ్మచారులుగా మిగిలి పోతుండగా.. కొంతమంది కుంగుబాటుతో ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఉద్యోగం తప్పనిసరి
ఒకప్పటిలా తల్లి దండ్రులు ఆలోచించడం లేదు. తాహతుకు మించి అప్పు చేసి అయినా సరే వెల్ సెటిల్ అయిన అల్లుళ్ళ కోసం చూస్తున్నారు. బాగా సెటిలైతే కట్నంతో పాటు మంచి సంబంధం కుదుర్చుకుని అబ్బాయిలు, వారి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. అందుకే కాస్త లేట్ అయినా సరే ఎలాగోలా మంచి ఉద్యోగం సంపాదించడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఆ క్రమంలో కొందరు విజయవంతమై పెళ్లిళ్లు చేసుకుంటుండగా.. కొంతమంది మంచి ఉద్యోగం కుదరక.. అటు పెళ్లి సంబంధాలు కుదరక.. మనస్తాపానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కొంపముంచుతోన్న కరోనా
కరోనా సాధారణ ప్రజలకే కాదు. పెళ్లికాని యువకులకు కొండంత కష్టం తెచ్చింది. లైఫ్ లో సెటిల్ అయ్యాం..ఇక పెళ్లి చేసుకుందాం.. అనుకుంటున్న వారి నెత్తిన బండ వేసింది. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలై ఎంతోమంది యువకులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇక చదువు పూర్తయి ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకుల బాధ తీర్చలేనిది. వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకడం లేదు. సంస్థలు ఉన్న ఉద్యోగులను తొలగించుకుంటూ వెళ్తుంటే ఇక కొత్తవారికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉద్యోగాలు లేక చాలా మంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
పెరిగిన ఆత్మహత్యల రేటు
తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా..2019లో పెద్ద సంఖ్యలో యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందుకు కారణాలు అనేకం. అయితే ఇందులో పెళ్లి ఇంకా కాలేదని బాధపడుతూ ఆత్మహత్యలకు పాల్పడిన వారే అధికంగా ఉన్నారని జాతీయ నేర గణాంకాల మండలి నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాదే 2, 331 యువకులు పెళ్లి కాలేదన్న బెంగతో ప్రాణాలు తీసుకున్నట్లు సర్వేలో తేలడం ఆందోళన పరుస్తోంది.
ఆడపిల్లల నిష్పత్తి ఓ కారణమే
గర్భనిరోధక సాధనాలు, అబార్షన్లు మొదలై చాలా సంవత్సరాలైనా 90 ల తర్వాత కొన్నేళ్లపాటు అబార్షన్ల సంఖ్య భారీగా జరిగింది. చాలా మంది అబ్బాయి కోసం స్కానింగులు చేయించుకుంటూ పుట్టేది అమ్మాయి అని తెలిస్తే చాలు అబార్షన్ చేయించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అబార్షన్లు చేయించు కోకుండా కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటి తరం యువకులకు పెళ్లి సంబంధాలు కుదరడం లేదంటే.. కారణం.. యువతుల నిష్పత్తి యువకులకు తగినంతగా.. లేకపోవడమే. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా పెళ్ళిళ్ళు కాలేదన్నా బాధతో ఆత్మహత్యలకు పాల్పడేవారి సంఖ్య పెరిగింది.