Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్ : 8 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయాయి !
By: Tupaki Desk | 18 Dec 2020 5:00 AM ISTకరోనా వైరస్ ప్రపంచంలోని ప్రతి దేశాన్ని కూడా ఆర్థికంగా తీవ్ర నష్టం చేస్తోంది. ముఖ్యంగా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి దేశంలో పేద, సామాన్య ప్రజలు దిక్కులేనివారయ్యారు. అప్పటివరకూ కూలీనాలీ చేసుకొని బతికేవారంతా రోడ్డున పడ్డారు. కరోనా దెబ్బకి ఉన్నచోట ఉపాధి లేక , తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కరోనా మహమ్మారి దెబ్బకు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే దాదాపు 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. కరోనా మహమ్మారి ఈ ప్రాంతంలోని ఉద్యోగ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిందని , చాలా దేశాలకు తక్కువ సామాజిక భద్రత, వ్యవస్థాపరమైన శక్తిసామర్థ్యాలు తక్కువగా ఉండడంతో వ్యాపార సంస్థలకు చేయూతనిచ్చేందుకు, వర్కర్లు నిలదొక్కుకొనేందుకు సాయం చేయడం కూడా సాధ్యం కాలేదని ది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఆసియా పసిఫిక్ విభాగం రీజనల్ డైరెక్టర్ చిహోకో అసడ మియాకవ చెప్పారు.
వీరందరూ ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. వీళ్లకు తోడు... ఆల్రెడీ ఎలాగొలా ఉద్యోగాలు చేస్తున్న వారికి... తమ ఉద్యోగం ఉంటుందో, ఊడిపోతుందో అనే భయం వెంటాడుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉద్యోగాలు 4.2శాతం తగ్గాయని, ఇక, ఈ తగ్గుదల మహిళల్లో 4.6శాతం ఉంటే.. పురుషుల్లో 4 శాతం ఉందని పేర్కొంది ఐఎల్ ఓ. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో యువత అత్యధికంగా ఉండగా, కార్మికుల ఆదాయం తొలి త్రైమాసికంలో 9.9శాతం తగ్గిందని ఆ నివేదిక చెప్పుకొచ్చింది. కరోనా ముందు పరిస్థితితో పోలిస్తే దాదాపు 50 మిలియన్ల ఉద్యోగాలు ఇక్కడ ప్రభావితమైనట్టు అంచనా వేసింది.
ఇక కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఉపాధి కోల్పోవడం , కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించడంతో చాలామంది సిటీల నుండి పల్లెటూర్ల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ మధ్య క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం. కరోనా వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తుండడంతో మళ్లీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి.