Begin typing your search above and press return to search.

కరోనా భయం.. హైదరాబాదీల్లో ఎంత ఉందంటే?

By:  Tupaki Desk   |   3 March 2020 8:45 AM GMT
కరోనా భయం.. హైదరాబాదీల్లో ఎంత ఉందంటే?
X
కరోనా భారత దేశంలోకి కూడా వచ్చేసింది. దేశంలో తాజాగా రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకటి ఢిల్లీలో.. రెండోది తెలంగాణలోని హైదరాబాద్ లో వెలుగుచూసింది. దీంతో ప్రాణాలు కబళించే ఈ కరోనా భయం జనాలకు పట్టుకుంది. కరోనా రాకుండా రక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవడం జనాలు ప్రారంభించారు.

కరోనా భయానికి హైదరాబాద్ లో ఎంత భయపడుతున్నారో తెలిపే ఉదంతం ఒకటి తాజాగా చోటుచేసుకుంది. మార్చి 10న హోలీ పండుగ. ఈ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని హైదరాబాదీలు గొప్పగా ప్లాన్ చేసుకున్నారట.. అయితే తాజాగా కరోనా తొలి కేసు హైదరాబాద్ లో నమోదు కావడంతో పలు గేటెడ్ కమ్యూనిటీలు ఈసారి హోలీ వేడుకలు జరుపుకోవద్దని తీర్మానించడం సంచలనంగా మారింది.

ఈ పరిణామం హైదరాబాద్ లో హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేసిన ఆర్గనైజర్లకు షాకింగ్ గా మారింది. కరోనా భయంతో జనాలు రాకపోతే ఈ ప్లాన్ చేసిన ఆర్గనైజర్లకు కోట్లలో నష్టం. వీరేకాదు ఈవెంట్ నిర్వాహకులు, పార్టీలకు ఆతిథ్యం ఇచ్చే హోటళ్లు, ఫుడ్ కోర్టులు, వివిధ ఫంక్షన్ హాల్స్ ఇలా చాలా వాటికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది.

కరోనా వైరస్ నేపథ్యం లో తెలంగాణ సర్కారు కూడా ఈసారి వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఉత్తర భారతంలోనూ ఈసారి కరోనా భయం తో హోలీ జోష్ తగ్గి పోయింది.