Begin typing your search above and press return to search.
కరోనాతో ఒక్క నెలలోనే.. 50 లక్షల ఉద్యోగాలు పోయాయి!
By: Tupaki Desk | 20 Aug 2020 4:00 PM ISTకరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్ని విలవిల్లాడుతున్నాయి. ఆర్థిక మాంద్యంలో కొట్టు మిట్టాడుతున్నాయి. పలు దేశాల జి.డి.పి వృద్ధి రేటు అమాంతంగా పడిపోయింది. కరోనా లాక్డౌన్ తో ఎన్నో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, సంస్థలు సిబ్బందిని తొలగించుకుంటూ భారం తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిన వారు కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయి రోడ్లపై పడుతున్నారు. చాలా సంస్థలు ఉద్యోగస్తుల సంఖ్యను తగ్గించుకుంటుండగా, కొన్ని సంస్థలు సిబ్బందిని దీర్ఘకాలిక సెలవుపై పంపాయి. మరికొన్ని సంస్థలు, నో వర్క్.. నో పే కింద ఉద్యోగులను ఇళ్లకే పరిమితం చేశాయి. అటు లాక్ డౌన్ వల్ల వ్యాపారాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితి అన్ని ప్రపంచ దేశాల్లో ఉంది. దీంతో పలు దేశాలు సంక్షోభంలో కూరుకు పోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2008లో తలెత్తిన ఆర్థిక మాంద్యం కన్నా కరోనాతో రాబోయే ఆర్థిక మాంద్యం.. మరింత ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో కూడా కరోనా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తోంది. ఒక్క జూలై నెలలోనే దేశంలో 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ)తాజా నివేదికలో వెల్లడించింది. లాక్ డౌన్ మొదలైన ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం1.8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని ప్రకటించింది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత కూడా ఉద్యోగ నియామకాల్లో పెద్దగా మార్పులేమీ రాలేదని సీఎంఐఈ పేర్కొంది. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జూలై నెలలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని పేర్కొంది. నెలనెలా జీతాలు ఇచ్చే ఉద్యోగాల కల్పనలో వృద్ధి రాకుంటే మాత్రం భారత ఆర్థిక వ్యవస్థ పై పెను ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.