Begin typing your search above and press return to search.

దేశంలో పెరిగిన నిరుద్యోగం.. ఆశలు గల్లంతు..!

By:  Tupaki Desk   |   28 Dec 2022 2:30 AM GMT
దేశంలో పెరిగిన నిరుద్యోగం.. ఆశలు గల్లంతు..!
X
కరోనాకు ముందు నుంచే దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోంది. కరోనా ఎంట్రీతో ఈ సమస్య మరింత పెరిగింది. గత రెండేళ్లుగా కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడిపైనే ఫోకస్ పెట్టాయి. ఈ కాలంలో రోజు వారీ కూలీలు.. వేతనంపై ఆధారపడే వేతన జీవులు.. ప్రైవేట్ ఉద్యోగులు.. స్కిల్ లేబర్స్ నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

బడా కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగించేందుకే మొగ్గు చూపాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. లాక్డౌన్ కారణంగా రవాణ వ్యవస్థ దెబ్బతినడంతో ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది డ్రైవర్లు.. ఇతర సిబ్బంది పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా రంగం.. విమానరంగం.. చిన్న చితక స్టార్టప్ కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు కంట్రోల్లో ఉంది. మరోవైపు కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నాయి. అయితే భారత్ లో ఇప్పటికే కరోనా టీకాలు విస్తృతంగా వేయడంతో ఆ ప్రమాదం ఏమి ఉండదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఎయిర్ పోర్టుల వద్ద కరోనా టెస్టులు.. స్క్రీనింగ్ పరీక్షలను అధికారులు నిర్వహించారు. ఆ తర్వాతే వారిని దేశంలోని అనుమతిస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో గత రెండేళ్లుగా నిరుద్యోగం బాగా పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఏకానమీ (సీఎంఐఈ) నివేదికలో వెల్లడైంది.

దేశంలో నిరుద్యోగ రేటు 6.43 శాతంగా నమోదైంది. పట్టణ నిరుద్యోగ రేటు 7.70 శాతం కాగా.. గ్రామీణ నిరుద్యోగ రేటు 5.84 శాతంగా ఉందని సీఎంఐఈ స్పష్టం చేసింది. 15 నుంచి 24 ఏళ్ల యువకుల్లో ఉద్యోగిత రేటు ఐదేళ్లలో సగానికి సగం పడి పోయిందని పేర్కొంది. 2017లో యువకుల్లో 20.9 శాతం ఉద్యోగత రేటు నమోదుకాగా 2022 నాటికి 10.4 శాతానికి పడి పోయిందని వెల్లడించింది.

గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు సెప్టెంబరులో 5.84 శాతానికి పడిపోయింది. దాదాపు పది రాష్ట్రాల్లో నిరుద్యోగం రేటు పెరిగిందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5.10 కోట్ల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారని సీఎంఐఈ పేర్కొంది.

ప్రభుత్వ ఆర్థిక విధానాల మార్పులతో ఈ పరిస్థితి మారుతుందని సూచించింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని.. సాగులో డిమాండ్ సృష్టించాలని సీఎంఈఐ ప్రభుత్వానికి సూచనలు చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.