Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ ...కండోమ్స్ కి భారీ గిరాకీ !

By:  Tupaki Desk   |   14 Feb 2020 1:00 AM IST
కరోనా ఎఫెక్ట్ ...కండోమ్స్ కి భారీ గిరాకీ !
X
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ప్రభావంతో భయంతో వణికిపోతోంది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1000 మందికి పైగా చనిపోయారు. వేలకొద్దీ జనాలు ఈ వైరస్ సోకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావంతో చైనా లో జనాభా పిట్టల్లా రాలిపోతున్నారు. అలాగే ఈ కరోనా వైరస్ ఇప్పటికి 26 దేశాలలో విస్తరించింది. ఇకపొతే , ఈ కరోనా వైరస్ ఇంతగా ప్రభావం చూపుతున్న ఈ సమయంలో సింగపూర్ లో కండోమ్స్ కొరత ఏర్పడటం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇంత భయానక పరిస్థితుల్లోనూ వారికి సెక్స్ మీద ఆశ తగ్గడం లేదా అని సందేహిస్తున్నారా? అయితే , మీరు ఊహించేది తప్పు .. సింగపూర్ లో కండోమ్స్ ఖాళీ కావడానికి అసలు కారణం సెక్స్ లో ఎక్కువగా పాల్గొంటుండటం కాదు ...కరోనా వైరస్ నుంచి సేఫ్టీ సింగపూర్ వాసులు కండోమ్స్ ని వాడుతున్నారు.

కరోనా వైరస్ నేపథ్యం లో సింగపూర్‌ లో ఫిబ్రవరి 7వ తేదీన డిసీజ్ ఔట్‌ బ్రేక్ రెస్పాన్స్ సిస్టమ్ కండీషన్ గా కింద ఆరెంజ్ లెవల్ అలర్ట్ ప్రకటించారు. COVID-19 అనే ఈ కరోనా వైరస్ వల్ల ఇప్పటికే ప్రపంచం మొత్తం అల్లాడుతున్న సమయంలో సింగపూర్ ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. సింగపూర్‌ లో ముందు జాగ్రత్త గా ప్రజలు మెడికల్ ఫేస్ మాస్కులు, గ్లవ్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మెడికల్ షాపుల్లో వాటికి భారీగా కొరత ఏర్పడింది. డిమాండుకు తగిన సంఖ్య లో మాస్కులు లేక పోవడంతో ప్రజలు ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వాటికి ప్రత్యామ్నయంగా హ్యండ్ శానిటైజర్లు, టిష్యులు, కండోమ్‌లను కొనుగులు చేస్తున్నారు.

అసలు , వారు కండోమ్స్ ని ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? అనే కదా మీ డౌట్ ..కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే చేతికి గ్లవ్స్ ధరించడం కూడా చాలా కీలకం. ఆ వైరస్ చాలా శక్తివంతమైనది కావడం తో వస్తువులను ముట్టుకున్న సరే సోకే ప్రమాదం ఉంది. ఓ వ్యక్తి లిఫ్ట్ బటన్ నొక్కేందుకు వేలుకు కండోమ్ తొడిగాడు. ఆ ఫొటో‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయడం తో వైరల్‌ గా మారింది. ఈ ఐడియా బాగా నచ్చేయడం తో జనాలు కండోమ్‌ లని విరివిగా కొనేయడం మొదలుపెట్టారు. ఫలితంగా సింగపూర్‌ లో కండోమ్‌ లకు కొరత ఏర్పడింది.