Begin typing your search above and press return to search.

మందు బాబులకు శుభవార్త చెప్పిన 'కరోనా వైరస్'

By:  Tupaki Desk   |   10 Feb 2020 6:20 AM GMT
మందు బాబులకు శుభవార్త చెప్పిన కరోనా వైరస్
X
చైనాలో వ్యాప్తి చెందినా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే 26 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ ప్రభావంతో 900 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అలాగే ఎంతోమంది ఈ వైరస్ భారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు. రోజురోజుకి దీని ప్రభావం మరింత ఎక్కువ అవుతుండటంతో ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇకపోతే ఈ వైరస్ ఇండియా లోకి కూడా ఇప్పటికే ప్రవేశించింది. దీనితో రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకుంటున్నారో అతి జాగ్రత్త తీసుకుంటున్నారో గాని డ్రంక్ అండ్ డ్రైవ్ లో బ్రీత్ ఎనలైజర్ టెస్టులుకు పోలీసులు ససేమిరా అంటున్నారు.

కొన్ని స్వచ్చంద సంస్థలు అయితే ఒక అడుగు ముందుకు వేసి ఈ వైరస్ తగ్గే దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ లు రద్దు చేయాలి అని ఏకంగా పోలీస్ ఉన్నతాధికారులకి లెటర్స్ సైతం రాస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కి తాము వ్యతిరేకం కాదు అని చెప్తూనే ఎవరో ఒకరు ఇద్దరు మందు బాబులను పట్టుకోవడం కోసం తాము డేంజర్ లో కి వెళ్తున్నామని ఆందోళన చెందుతున్నారు. ముందు బ్రీత్ ఎనలైజర్ ను నోటి దగ్గర పెట్టి ఊదమని చెప్తారు మందు తాగారని అనుమానం వస్తే అప్పుడు స్ట్రా పైపు పెట్టి మరో సారి ఊదించి బడ్ ఆల్కహాల్ కౌంట్ రికార్డ్ చేస్తారు. దీనిలో ఒకరికి వాడిన స్ట్రా మరొకరి కి వాడితే కరోనా ఉన్న వాళ్ళు ఉదింది మళ్ళీ తాము ఊదితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అని వాపోతున్నారు.

దీనితో అయితే... ఈ వైరస్ కారణంగా ప్రస్తుతం బెంగళూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయడాన్ని పోలీసులు నిలిపివేశారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ..కొందరు ఈ వైరస్ భారిన పడే అవకాశం ఉండటంతో బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసు విభాగం హెడ్‌ రవి కాంత్ గౌడ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులని తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశించారు. అవసరమైతే ఆల్కోమీటర్‌ వాడకుండా వైద్య పరీక్షలు నిర్వహించి జరిమానాలు విధించాలని ఉన్నతాధికారులు తెలిపారు.