Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : ఖాతాదారులకు బ్యాంకులు అత్యవరస రుణాలు !

By:  Tupaki Desk   |   26 March 2020 4:50 AM GMT
కరోనా ఎఫెక్ట్ : ఖాతాదారులకు బ్యాంకులు అత్యవరస రుణాలు !
X
కరోనా వైరస్‌ ..ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అతి పెద్ద మహమ్మారి. ఈ మహమ్మారి నుండి తప్పించుకోవడానికి ..ప్రపంచంలోని ప్రతి దేశం కూడా తమ సర్వశక్తులని ఒడ్డుతుంది. ఇక ఈ కరోనా వైరస్ భారత్ లో ఇంకా ఎక్కువగా ప్రభావం చూపకూడదు అని ..కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలు లో ఉంటుంది అని అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దీనితో సాధారణ , మధ్యతరగతి ప్రజలలో అలజడి మొదలైంది. ఈ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలతో ప్రజలు, వ్యాపారాలపై పడుతున్న ప్రభావం నుంచి ఖాతాదారులను రక్షించేందుకు కొన్ని బ్యాంకులు నడుంభిగించాయి.

ఈ ఆపద సమయంలో ఇబ్బదులు ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక అత్యవసర రుణాలను అందించడానికి సన్నధం అయ్యాయి. ఈ జాబితాలో ఇండియన్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉన్నాయి. ప్రత్యేక అత్యవసర రుణ ఉత్పత్తుల్ని బుధవారం ఈ బ్యాంకులు ప్రకటించాయి. వీటితో పాటు కెనరా బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లు కూడా ఖాతాదారులకు అత్యవసర రుణ సదుపాయం కల్పించబోతున్నాయి. సవాళ్లతో కూడిన ప్రస్తుత తరుణంలో ఖాతాదారుల పక్షాన నిలిచేందుకు బ్యాంక్‌ సిద్ధంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో చాలా రంగాలు కష్టాలు ఎదుర్కొంటున్నందున వ్యాపారాలకు, రిటైల్‌ ఖాతాదార్లకు ద్రవ్య లభ్యత సమస్యలు రాకుండా రుణ ఉత్పత్తుల్ని ప్రారంభించామని ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పద్మజా చుండూరు వెల్లడించారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా కొవిడ్‌ ఎమర్జెన్సీ లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ని ప్రారంభించింది. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా రుణ గ్రహీతలకు అత్యవసర రుణాలను ప్రకటించింది. తమ ఎమ్‌ ఎస్‌ ఎమ్‌ ఈ ఖాతాదారులు, కార్పొరేట్‌ రుణ గ్రహీతలకు ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ అందించేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా సిద్ధమైంది.

గత వారం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా తమ రుణ గ్రహీతలకు అదనపు నిధుల్ని అందజేసేందుకు సిద్ధమైన సంగతి అందరికి తెలిసిందే. కెనరా బ్యాంక్‌ కూడా ఎమ్‌ ఎస్‌ ఎమ్‌ ఈ/కార్పొరేట్‌/బిజినెస్‌/అగ్రి/రిటైల్‌ ఖాతాదారులకు ప్రత్యేక రుణ సహాయాన్ని అందించి , వారికీ భరోసా ఇవ్వనుంది. కరోనా లైన్‌ ఆఫ్‌ సపోర్ట్‌ పథకాన్ని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ ప్రారంభించింది. మరిన్ని బ్యాంకులు కూడా ఈ ప్రత్యేక అత్యవసర రుణ పథకాలతో ముందుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.