Begin typing your search above and press return to search.

50 లక్షలు దాటిన కరోనా మరణాలు !

By:  Tupaki Desk   |   2 Nov 2021 1:30 PM GMT
50 లక్షలు దాటిన కరోనా మరణాలు !
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మృత్యుఘోష కొనసాగుతుంది. కరోనా వైరస్ తో ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య సోమవారం తో 50 లక్షలు దాటింది. కరోనా మరణాల్లో టాప్-5 దేశాలగా అమెరికా(7,66,299),బ్రెజిల్(6,07,860),భారత్(4,58,470), మెక్సికో(2,88,365), రష్యా(2,39,693) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా మొత్తం మరణాల్లో… 50శాతం మరణాలు అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, బ్రెజిల్ దేశాల నుంచే నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమై, అత్యధిక మరణాలు నమోదైన దేశం అమెరికానే. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం ఈ కరోనా మరణాల సంఖ్య లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో జనాభాతో సమానం.

పీస్ రీసెర్చ్ ఇన్‌ స్టిట్యూట్ ఓస్లో అంచనాల ప్రకారం 1950 నుంచి దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో మరణించిన వారి సంఖ్యతో ఇది దాదాపు సమానం. వాస్తవానికి ఈ కరోనా మరణాల సంఖ్య వాస్తవ లెక్కల కంటే తక్కువే అని నిపుణులు అభిప్రాయపడ్డారు. టెస్టులు పరిమిత సంఖ్యలో చేయడం, కరోనా సోకినా హాస్పిటల్ లో చేరకుండా ఇంట్లోనే మరణించిన వారిని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. భారత్ లాంటి దేశాల్లో ఇలానే జరిగిందన్నారు. భారత్ లాంటి దేశాల్లో ఇలానే జరిగిందన్నారు.

కరోనా మహమ్మారి ధనిక దేశాలనే తీవ్రంగా ప్రభావితం చేయడం అరుదైన విషయమని నిపుణులు పేర్కొన్నారు. భారత్ లో ఈ ఏడాది మేలో కరోనా డెల్టా రకం విజృంభించింది. కానీ ఇప్పుడు రోజువారీ మరణాల సంఖ్య రష్యా, అమెరికా, బ్రిటన్ వంటి ధనిక దేశాలతో పోల్చితే చాలా తక్కువగా ఉంది. మరోవైపు,ప్రస్తుతం కరోనా హాట్స్పాట్ ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్, తూర్పు ఐరోపాలోని పలు ప్రాంతాల్లో వైరస్ ఉద్ధృతి ఆందోళకర స్థాయిలో ఉంది.

ఆయా దేశాల్లో వ్యాక్సినేషన్ నత్తనడకన సాగడం వల్ల మరణాలు పెరుగుతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో బూస్టర్ డోసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నా, పేద దేశాల్లోని ప్రజలకు మాత్రం ఇంకా ఒక్క డోసు టీకా కూడా అందలేదు. 130కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికాలో కేవలం 5శాతం మందే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇండియాలో కరోనాతో ఇప్పటివరకు 4.58 లక్షల మంది మృతి చెందారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అమెరికా, రష్యా వంటి దేశాల్లో కరోనా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 30 రోజుల్లో అమెరికా లో 43వేల మంది, రష్యాలో 28వేల మంది ప్రజలు కరోనా కారణంగా చనిపోయారు. ఆ రెండు దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా మరణాల సంఖ్య తక్కువగానే ఉంది. కాగా 1950 నుంచి ఇప్పటివరకు వివిధ దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో మరణించిన వారి కంటే కరోనా వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు.