Begin typing your search above and press return to search.

అయ్యో త‌ల్లీ.. నోటితో కూతురు శ్వాస ఊదినా..

By:  Tupaki Desk   |   2 May 2021 9:00 PM IST
అయ్యో త‌ల్లీ.. నోటితో కూతురు శ్వాస ఊదినా..
X
క‌రోనా మ‌హ‌మ్మారి కొన‌సాగిస్తున్న దారుణ మార‌ణ‌కాండకు అంతే లేకుండాపోతోంది. నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. క‌ళ్ల‌ముందే అన్యాయంగా చ‌నిపోతున్న త‌మ‌వారిని కాపాడుకోలేక నిశ్చేష్టులై చూస్తున్న‌వారు కొంద‌రైతే.. త‌మవాళ్ల‌ను కాపాడుకునేందుకు ప్రాణాలు ప‌ణంగా పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌వారు మ‌రికొంద‌రు!

తాజాగా.. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ఓ కూతురు ప‌డిన వేద‌న చూసి అందరి గుండెలవిసిపోయాయి. అయ్యో త‌ల్లీ అంటూ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. భైరాచి జిల్లాకు చెందిన ఓ మ‌హిళ ఇటీవ‌ల కొవిడ్ బారిన ప‌డింది. ప‌రిస్థితి తీవ్రం కావ‌డంతో ఇద్ద‌రు కూతుళ్లూ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

బాధితురాలు శ్వాస తీసుకోవ‌డానికి తీవ్ర ఇబ్బందులు ప‌డింది. కానీ.. అక్క‌డ ఆక్సీజ‌న్ అందుబాటులో లేదు. ఊపిరి తీసుకోలేక ఆమె విల‌విల్లాడిపోయింది. ఇదంతా చూస్తున్న కూతుళ్లు గ‌ట్టిగా రోదించారు. వారిలో ఓ కూతురు త‌ల్లి నోట్లో నోరు పెట్టి ఆక్సీజ‌న్ ఊదుతూ త‌ల్లిని కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ.. ఉప‌యోగం లేకపోయింది. కాసేప‌టికే బాధితురాలు క‌న్నుమూసింది. త‌న‌కు ప్ర‌మాదం అని తెలిసినా.. త‌ల్లిని కాపాడుకునేందుకు బిడ్డ చేసిన ప్ర‌య‌త్నం ప్ర‌తి ఒక్క‌రినీ క‌ల‌చివేసింది.

ఈ మ‌ధ్య‌నే అదే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఆగ్రాలో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. త‌న భ‌ర్త‌ను కాపాడునేందుకు నోటి ద్వార శ్వాస అందించింది. అయిన‌ప్ప‌టికీ.. భ‌ర్త‌ను కాపాడుకోలేక‌పోయింది. దేశంలో నెల‌కొన్న దారుణ పరిస్థితికి ఈ ఘ‌ట‌న‌లు అద్దం ప‌డుతున్నాయ‌ని ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు.