Begin typing your search above and press return to search.

ఢిల్లీలో కరోనా డేంజర్.. అమిత్ షా సీరియస్

By:  Tupaki Desk   |   15 Nov 2020 4:20 PM IST
ఢిల్లీలో కరోనా డేంజర్.. అమిత్ షా సీరియస్
X
దేశ రాజధాని ఢిల్లీ చలికాలంలో వణికిపోతోంది. ఓవైపు కరోనా కోరలు చాస్తుండగా.. మరోవైపు కాలుష్యం కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. తాజాగా ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై సీరియస్ అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. కరోనా కేసుల తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఆదివారం సాయంత్రం 5 గంటలకు అమిత్ షా తన కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా ఈ మీటింగ్ కు పిలిచారని తెలిసింది.

ఇప్పటికే అమిత్ షా, కేజ్రీవాల్ ఢిల్లీలో కరోనా కట్టడిపై చర్చించారు. అయినా అదుపులోకి రాకపోవడంతో ఇప్పుడు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు వైద్య సదుపాయాలపై దృష్టిసారించారు.

ఢిల్లీలో కరోనా కేసులు పెరగడంతో సరిపడా పడకలు లేకపోవడం.. వెంటిలేటర్ సపోర్టుతో బెడ్స్ కొరత తీవ్రమైంది. ఇప్పటికే ప్రైవేట్ ఆస్పత్రుల్లో 80శాతం బెడ్స్ ను కరోనా రోగులకు కేటాయించాలని కేజ్రీవాల్ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మందలించినా కేజ్రీ సర్కార్ పట్టించుకోవడం లేదు.

12 రోజుల నుంచి ఢిల్లీలో చలి పెరగడంతో కరోనా కేసులు జెట్ స్పీడుగా పెరిగిపోతున్నాయి. 3న 6725 కేసులు నమోదయ్యాయి.మళ్లీ విజృంభణ, సెకండ్ వేవ్ మొదలు కావడంతో ఢిల్లీలో ఆందోళన నెలకొంది. దీపావళి కాలుష్యం పెరగడంతో మరింత ఎక్కువైంది. దీనిపై అమిత్ షా కార్యాచరణ చేపట్టాలని తాజాగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.