Begin typing your search above and press return to search.

కరోనా: ఉద్యోగాలు వదిలిన వారికి బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   27 Sept 2020 9:00 AM IST
కరోనా: ఉద్యోగాలు వదిలిన వారికి బంపర్ ఆఫర్
X
కరోనా టైంలో దేశంలోని చాలా మంది ఉద్యోగాలు పోయాయి. కంపెనీలు మూతపడి కోట్ల మంది రోడ్డున పడ్డారు. కరోనా వల్ల వ్యాపారాలు తగ్గి కొందరినీ తీసేశారు. ఐటీ సర్వీసుల్లోనూ లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

ఈ క్రమంలోనే ఐటీ సర్వీసుల గ్లోబల్ దిగ్గజం ‘యాక్సెంచర్’ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న సంగతి తెలిసిందే. అయితే తమ సంస్థలో స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకునే వారికి 7 నెలల వేతనాలు చెల్లించాలని యాక్సెంచర్ భావిస్తోంది.

మూడు నెలల కాలాన్ని నోటీస్ పీరియడ్ గా పేర్కొనగా.. మరో నాలుగు నెలల వేతనాలను చెల్లించనుంది. మెజారిటీ కంపెనీలు ఉద్యోగాలు వదులుకున్న వారికి రెండు నుంచి మూడు నెలల వేతనాలు మాత్రమే ఇచ్చాయి.

కానీ యాక్సెంచర్ గత కరోనా టైంలో నైపుణ్యం లేని 5శాతం ఉద్యోగులను తీసేసింది. వారికిప్పుడు 7 నెలల వేతనాలు చెల్లించేందుకు సిద్ధమైంది. యాక్సెంచర్ సంస్థకు ఇప్పటికే 70శాతం రెవెన్యూ డిజిటల్ సేవల నుంచి లభిస్తాయి.