Begin typing your search above and press return to search.

హీరోయిన్ కు షాకిచ్చిన ఇన్ స్పెక్టర్ ధర్మేంద్ర

By:  Tupaki Desk   |   16 May 2016 10:09 AM GMT
హీరోయిన్ కు షాకిచ్చిన ఇన్ స్పెక్టర్ ధర్మేంద్ర
X
ఎవరీ ఇన్ స్పెక్టర్ ధర్మేంధ్ర అని ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారేమో కానీ.. విషయం మొత్తం చదివాక మాత్రం ఆయన్ను మర్చిపోలేరు. సినిమాల్లో కనిపించే నీతికి.. న్యాయానికి నిలువెత్తు రూపం అన్నట్లుగా.. వర్క్ తప్ప మరింకేమీ పట్టని ఆయన తీరు ఒక బాలీవుడ్ హీరోయిన్ కు షాకింగ్ మారింది. నిజానికి ఆ హీరోయిన్ తప్పు లేకున్నా.. ఆమె సహాయకులు చేసిన హడావుడితో ఆమె చిక్కుల్లో పడిందని చెప్పక తప్పదు. నిజానికి ఈ ఉదంతంలో ఇన్ స్పెక్టర్ తో పాటు.. హీరోయిన్ ను కూడా అభినందించాల్సిందే.

ఇంతకీ ఎవరా బాలీవుడ్ హీరోయిన్? ఎవరీ ఇన్ స్పెక్టర్ ధర్మేంద్ర అన్న విషయంలోకి వెళితే.. నొయిడాలోని ఒక షాపింగ్ మాల్ లో జరుగుతున్న ఫ్యాషన్ షోకు భాలీవుడ్ అందాల భామ అదితిరావు అతిధిగా వెళ్లారు. ఆమెకు నొయిడాలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. స్టార్ హోటల్ నుంచి విలాసవంతమైన జాగ్వార్ కారులో మాల్ కి ఆమె బయలుదేరారు. హోటల్ బయటకు వచ్చేసరకు అంతా బాగానే ఉన్నా.. మాల్ కి త్వరగా వెళ్లాలన్న ఉద్దేశంతో కారు డ్రైవర్ అత్యుత్సాహంతో రాంగ్ రూట్ లో వెహికిల్ ను తీసుకెళ్లాడు.

అయితే.. డ్యూటీ మైండ్ ఉన్న అక్కడి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ జాగ్వార్ కారును ఆపేయటమే కాదు.. రాంగ్ రూట్ లో వస్తున్నందుకు కేసు నమోదు చేశాడు. కారులో ఉంది ఎవరో తెలుసా? లాంటి మాటలకు.. తనకు అలాంటివేమీ అవసరం లేదన్న ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఫార్మాలిటీస్ కు సమయం పట్టటం.. ఈ వ్యవహారం ప్రిస్టేజ్ ఇష్యూగా మారటంతో మాల్ యాజమాన్యం రంగంలోకి దిగింది. అయినప్పటికీ ఇన్ స్పెక్టర్ ధర్మేంద్ర మాత్రం తన పని తాను చేసుకుపోవటమే కాదు ఎవరి ఒత్తిళ్లకు తగ్గలేదు.

జరుగుతున్న రచ్చను అర్థం చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ అదితిరావు కారులో నుంచి బయటకు వచ్చి దగ్గర్లోని మాల్ కి నడిచి వెళ్లిపోయిందట. తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా వదిలేది లేదని ధర్మేంద్ర స్పష్టం చేస్తే.. ఇలాంటి ఇష్యూలో ఓవరాక్షన్ చేయకూడదన్న మెచ్యూరిటీతో వ్యవహరించి అదితిరావు మంచి పని చేశారని చెబుతున్నారు. ఏమైనా ముక్కుకు సూటిగా పోయే ఇన్ స్పెక్టర్లను రీల్ లైఫ్ లో చూసిన అదితిరావుకు రియల్ లైఫ్ లోనూ చూసే అవకాశం దక్కిందని చెప్పాలి.