Begin typing your search above and press return to search.

థాయ్ కిక్కు.. మ‌సాజ్ పేరుతో వ్య‌భిచారం!

By:  Tupaki Desk   |   21 Aug 2017 1:40 PM IST
థాయ్ కిక్కు.. మ‌సాజ్ పేరుతో వ్య‌భిచారం!
X
దేశంలోనే పేరు గొప్ప న‌గ‌రంగా గుర్తింపు పొందిన రాజ‌ధాని భాగ్య‌న‌గ‌రానికి లేని అల‌వాట్లు లేవు అనిపించేలా త‌యారైంది ప‌రిస్థితి. మొన్న‌టికి మొన్న డ్ర‌గ్స్ భూతం హైద‌రాబాద్‌ ను మ‌త్తులో జోగేలా చేసింది. దీనిని అరిక‌ట్ట‌డ‌మెలా దేవుడా ? అని అధికారులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఏదో ర‌కంగా ఈ భూతాన్ని త‌రిమికొట్టే ప్ర‌య‌త్నం సాగుతోంది. ఇంత‌లో ఉరుములు లేని మెరుపుల్లా.. భాగ్య‌న‌గ‌ర్ ప‌రువు తీసేసాలా.. మ‌సాజ్ సెంట‌ర్ల మాటున వ్య‌భిచార గృహాలు వెలుగు చూశాయి. ఇది ఒక సెంట‌ర్‌లో ఒక చోట - ఒక ఇంట్లో కూడా కాదు - రాజ‌ధానికి గుండె కాయ‌వంటి ప‌లు ప్రాంతాల్లో ఈ మ‌సాజ్ సెంట‌ర్ల మాటున వ్య‌భిచారం య‌థేచ్ఛ‌గా సాగిపోతోంది.

ముఖ్యంగా ఇండియ‌న్స్ క‌న్నా థాయ్‌ లాండ్ మ‌హిళ‌లైతే ఆ కిక్కే వేర‌ప్పా అనుకున్న నిర్వాహ‌కులు థాయ్ యువ‌తులు - మ‌హిళ‌ల‌ను రంగంలోకి దింపి.. మ‌సాజ్ పేరుతో మ‌జా ప‌నులు చేయిస్తున్నారు. నెల‌కు రూ. లక్ష‌ల్లో సోమ్మును వెనుకేసుకుంటున్నారు. ఎట్ట‌కేల‌కే వీరిపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు.. అతి ర‌హ‌స్యంగా వీరి భ‌ర‌తం ప‌ట్టారు. వివ‌రాల్లోకెళితే.. హైద‌రాబాద్‌ లోని బంజారాహిల్స్‌ నందగిరి హల్స్‌ కి చెందిన దాస‌రి సిద్ధార్థ్.. బీటెక్ పూర్తి చేశాడు. అనంత‌రం ఐర్లాండ్ వెళ్లి అక్క‌డ ఎంటెక్ చేశాడు. ఈ క్ర‌మంలో మంచి ఉద్యోగం వెతుక్కుని చ‌క్క‌టి జీవితం ప్రారంభించాల్సిన ఇత‌ను.. వ‌క్ర‌మార్గం ప‌ట్టాడు. అక్ర‌మ మార్గంలో అమాంతం ఎదిగిపోవాల‌ని ప్లాన్ వేసుకున్నాడు.

దీనికి అనుకూలంగా.. తాను గ‌తంలో ముంబయిలో మసాజ్‌ కోసం వెళ్లిన స్పాను వేదిక చేసుకున్నాడు. దీనిని అడ్డు పెట్టుకుని మ‌గాళ్ల‌కు మ‌జా అందించే మ‌హిళ‌ల‌తో వ్యాపారం చేయాల‌ని డిసైడ్ అయ్యాడు. అంతే, వెంట‌నే ప్లాన్‌ ను అమ‌ల్లో కూడా పెట్టేశాడు. తొలుత ముంబై - తమిళనాడు చెంబూరులలో స్పాలను లీజుకు తీసుకున్నాడు. అక్కడ నష్టం రావడంతోపాటు.. గత ఏడాది చెంబూరు పోలీసులు ఈ అక్రమ వ్యాపారాన్ని గుర్తించి సిద్ధార్థ్‌ ను అరెస్ట్‌ చేశారు. అయినా కూడా ప‌ద్ధ‌తి మార్చుకోకుండా హైద‌రాబాద్ అయితే సేఫ్‌ గా ఉంటుంద‌ని, తెలిసిన ప్రాంత‌మ‌ని భావించి.. ఇక్క‌డ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ క్ర‌మంలో ఇత‌నికి థాయ్‌ లాండ్‌ కి చెందిన ‘కాకే’ అనే మ‌హిళ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

థాయ్లలాండ్‌ కు చెందిన ఓ మ‌హిళ‌ స‌ల‌హా మేర‌కు సిద్ధార్థ్ త‌న వ్యాపారాన్ని కొత్త పుంతుల తొక్కించాడు. థాయ్‌ మహిళలతో మసాజ్‌ చేయిస్తే వినియోగదారులను సులభంగా ఆకర్షించవచ్చన్న ఆమె ఆలోచనను అమలు చేయాలన్న నిర్ణయానికొచ్చాడు. ఈ ముసుగులో వ్యభిచార దందా నడిపేందుకు సిద్ధమయ్యాడు. ఉద్యోగాలు ఆశచూపి థాయ్‌ లాండ్‌ నుంచి యువతుల్ని ఇక్కడికి పంపడంతో.. హైదరాబాద్‌ లోని మాదాపూర్‌ లో మూడు - జూబ్లీహిల్స్‌ లో నాలుగు - బెంగళూరులో ఒకటి చొప్పున స్పాలను ప్రారంభించాడు. ‘థాయ్‌ యువతులకు బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో వసతి కల్పించడంతోపాటు..నెలకు రూ.25వేల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నాడు.

సిద్ధార్థ్‌ తన అక్రమ వ్యాపారానికి సహకరించేందుకు సర్ఫరాజ్‌ అలీ - వినయ్‌ - అజయ్‌ లతో ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దందాలో సిద్దార్ఘ్‌ నెలకు సుమారు రూ.90 లక్షలు ఆర్జిస్తున్నాడు. ఇక‌, సిద్దార్థ్ పాపం పండిన‌ట్టు.. ఈ విష‌యం ఆనోటా ఈనోటా.. సైబరాబాద్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్యకు ఫిర్యాదులు అందాయి. దీంతో అతి ర‌హ‌స్యంగా దీనిపై దృష్టి పెట్టారు. థాయ్‌ మసాజ్‌ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న 12 స్పాల‌పై ఏక‌కాలంలో శ‌నివారం రాత్రి దాడి చేయించారు. ఆయా స్పాలలో మసాజ్‌ టేబుల్స్‌ కు బదులుగా పడకలను ఏర్పాటు చేయడాన్ని దాడుల సందర్భంగా గుర్తించారు. మొత్తం 65 మంది యువతుల్ని రెస్క్యూ హోంకు తరలించిన పోలీసులు 19 మంది నిర్వాహకుల్ని అరెస్టు చేశారు. స్పాల నుంచి రూ.3.38 లక్షల నగదు - ల్యాప్‌ టాప్‌ లు - స్వైపింగ్‌ యంత్రాలు - వినియోగించిన కండోమ్‌ లను స్వాధీనం చేసుకున్నారు.

సిద్దార్థ్ త‌న వ్యాపారాన్ని మూడు స్పాలు..ఆరు వ్యభిచారాలుగా సాగించాడు. విటుల‌ను ఆక‌ర్షించేందుకు గోల్డ్‌.. సిల్వర్‌.. రెగ్యులర్ అనే కార్డుల‌ను ప్ర‌వేశ పెట్టాడు. స్పాలలో సభ్యులుగా ఉన్న 300-500 మంది వినియోగదారుల కోసం గోల్డ్‌ - సిల్వర్‌ - రెగ్యులర్‌ పేరిట కార్డులను జారీ చేశారు. రూ.లక్ష చెల్లిస్తే శాశ్వత సభ్యత్వం ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయి. సాధారణంగా స్పాలలో నిబంధనల ప్రకారం అందించే సేవలకు గాను గరిష్ఠంగా రూ.6 వేల వరకే ప్యాకేజీ ఉండగా..చాలా మంది నుంచి రూ.9 వేలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఆ లావాదేవీలను - వినియోగించిన పలు కండోమ్‌ లు - ఆన్‌ లైన్‌ పేమెంట్‌ వివరాలు - బ్యాంకు ఖాతాల వివరాలను ఆధారాలుగా సేకరించారు.

సిద్ధార్థ్ నిర్వ‌హించిన స్పాలు ఇవే..

* గచ్చిబౌలి ఠాణా: సప్త(సూరజ్‌ టవర్స్‌) - తంత్ర(గచ్చిబౌలి ఫ్లైఓవర్‌) - అవురా(కొత్తగూడ రోడ్‌) - మోహ్‌(హిమగిరి హాస్పిటల్‌ ఎదుట) - మంధర(కేఎస్‌ బేకర్స్‌ పక్కన) - వి(ఐసీఐసీఐ బ్యాంకుపైన)

* మాదాపూర్‌ ఠాణా: సప్త(హెచ్‌ డీఎఫ్‌ సీ బ్యాంకు పైన) - అవురా(సైబర్‌ టవర్స్‌ రోడ్‌) - తంత్ర(డిమార్ట్‌ ఎదురు) - బ్లిజ్‌(లక్మే సెలూన్‌ పక్కన) - మోహ్‌(ఇమేజ్‌ గార్డెన్స్‌ పక్కన) - న్యూ రివైవ్‌(డిమార్ట్‌ పక్కన)