Begin typing your search above and press return to search.

నల్లగా పుట్టడమూ పాపమేనా! ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కలరిజం

By:  Tupaki Desk   |   22 Sept 2020 9:45 AM IST
నల్లగా పుట్టడమూ పాపమేనా! ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కలరిజం
X
‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి దానా’ అంటూ మన సినీ కవులు వర్ణిస్తుంటారు. లేదా ఫలానా అమ్మాయి సిమ్లా ఆపిల్​ లాగా ఉందంటారు. మిల్కీ బ్యూటీ, చందమామ, వంటి పేర్లతో సినీ హీరోయిన్లను పొగిడేస్తుంటారు. తెల్లగా ఉండేవాళ్లకు సామాజికంగానూ ఎంతో గౌరవం, వారు ఏరంగంలో ఉన్నా ప్రత్యేక గుర్తింపు పొందుతూ ఉంటారు. అయితే తెల్లగా ఉండే వారిని ఎంత పొగిడినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఇతరులను (అంటే నల్లగా ఉన్నవాళ్లను, చామనఛాయ) ఉన్నవాళ్లను విమర్శించినప్పడే అసలు సమస్య వస్తుంది. ప్రస్తుతం ఇటువంటి ఓ వివక్ష ప్రపంచవ్యాప్త సమస్యగా మారింది. అదే కలరిజం. దీని ఎఫెక్ట్​తో ‘ఫెయిర్​ అండ్​ లవ్లీ’ అనే ఓ సౌందర్య లేపన ఉత్పత్తి సంస్థ తన పేరునే మార్చుకోవలసి వచ్చింది. ప్రస్తుతం ఈ ప్రొడక్ట్​ పేరును గ్లో అండ్​ లవ్లీ గా మార్చేశారు.

ఎంటీ కలరిజం..

తెల్లగా, ఎర్రగా ఉండేవాళ్లను అధికంగా గౌరవించడం, ఇతరులను కించ పర్చడమే కలరిజం. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య కొన్ని ఏళ్లుగా ఉన్నప్పటికీ ఎందుకో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఏడాది మేలో జార్జి ఫ్లాయిడ్ హత్య తో ప్రపంచ వ్యాప్తం గా వర్ణవివక్ష కు వ్యతిరేకం గా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. దీంతో ఈ సమస్య ఆసియా దేశాలకు కూడా పాకింది.

దుమారం రేపిన ఓటీటీ సినిమా..

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ‘ఇండియన్​ మ్యాచ్ ​మేకింగ్​’ అనే రియాలిటీ వెబ్​ సీరిస్​ ను ప్రారంభించింది. ఆన్​లైన్​ మ్యారెజ్​ బ్యూరో నిర్వహించే ఓ మహిళ.. తెల్లగా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల కోసం ప్రపంచమంతా వెతుకుతూ ఉంటుంది. ఇదే చిత్ర కథాంశం. అయితే సినిమాలో కలరిజం ఉందంటూ పలు ప్రజాసంఘాలు, సినీ ప్రేక్షకుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతున్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కలరింగ్ సమస్యను ఎలా తగ్గించాలనే విషయంపై అన్నదేశాలు ఏకతాటిపైకి వచ్చి చర్చలు జరపాలని పలువురు కోరుతున్నారు.