Begin typing your search above and press return to search.

త్వరలోనే మగవాళ్లకూ గర్భ నిరోధక మాత్రలు .. అతని సహకారంతోనే !

By:  Tupaki Desk   |   5 Aug 2021 3:36 PM IST
త్వరలోనే మగవాళ్లకూ గర్భ నిరోధక మాత్రలు .. అతని సహకారంతోనే !
X
గర్భనిరోధక మాత్రలు అనగానే అవి ఆడవాళ్లు వినియోగిస్తారు కదా అని అనుకోవడం సహజమే. కానీ, అతి త్వరలో అది తప్పు కాబోతుంది. కానీ ఇక నుంచి మగవారికి కూడా గర్భనిరోధక మాత్రంలు అందుబాటులోకి రానున్నాయి. అదేంటీ గర్భాన్ని నిరోధించేవి గర్భనిరోధక మాత్రంలు గర్భం ఆడవారికి కదా వస్తుంది. మరి మగవారికి గర్భనిరోధక మాత్రలు ఏంటీ అనే అనుమానం రావచ్చు. గర్భాన్ని నిరోధించటానికి మాత్రలు, లూప్ వంటి పలు సాధనాలుంటాయి మహిళలకు. అదే మగవారికైతే కండోమ్స్ ఉపయోగిస్తారు. కానీ ఇకనుంచి మగవారికి కూడా గర్భనిరోధక మాత్రలు మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్నాయి.

కేవలం, శారీరక సుఖం కోసం కలయిక కోరుకునే జంటల కోసం ఈ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తేనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ డుండీ(స్కాట్లాండ్‌) ప్రకటించింది. ఈ మేరకు గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతుండగా, ఈ ప్రయోగాల్లో డుండీ మొదటి అడుగు వేసింది. వీలైనంత త్వరగా మార్కెట్‌లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇలా మగవారికి గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రావటానికి ఓ ప్రముఖ వ్యక్తి సహాయరం అందిస్తున్నారు. అయన మరెవరో కాదు .. ద గ్రేట్ పర్సన్ ప్రపంచ కుబేరుడు..మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌.

మగవారికి గర్భనిరోధక మాత్రలు తయారీకి ప్రయోగాలకు బిల్స్ గేట్స్ సహకారం అందిస్తున్నారు. బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ మగవాళ్ల సంతాన నిరోధక మాత్రల తయారీ నడుస్తోంది. దీని కోసం బిల్ గేట్స్ ఫౌండేషన్‌ నుంచి 1.7 మిలియన్‌ డాలర్ల సాయం అందించారు బిల్ గేట్స్. ఈ మగవారి గర్భనిరోధక మాత్రలు ఆడవాళ్లలో అండాల తయారీని గర్భనిరోధక మాత్రలు ఎలా అడ్డుకుంటాయో, మగవాళ్లపై పని చేస్తాయట. అంటే, మగవాళ్లలోనూ వీర్యకణాల తయారీని నిలిపివేస్తాయన్నమాట.సురక్షిత శృంగారం, ఆలస్యంగా పిల్లలు కనడం లేదా పూర్తి అయిష్టత కారణాలతో చాలా ఏళ్ల క్రితమే కండోమ్‌లను మార్కెట్‌ లోకి తెచ్చారు సైంటిస్టులు.

అయితే వీటి తర్వాత మెడికల్‌ సైన్స్‌ లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు, అదీ ఇంత కాలానికి తెర మీదకు రావడం విశేషం. 2015-19 మధ్య కాలంలో 121 మిలియన్ల మంది మహిళలు ఇష్టం లేకున్నా గర్భం దాల్చారని పలు సర్వేల్లో వెల్లడైంది. ముఖ్యంగా పేద దేశాల్లో జనాభా పెరుగుదలకు ఈ సంతాన నిరోధక మాత్రలు అడ్డుకట్ట వేస్తాయని University of Dundee ప్రొఫెసర్‌ క్రిస్‌ చెప్తున్నాడు. అయితే ఈ మాత్రలు సుఖ వ్యాధుల్ని అడ్డుకుంటాయా అని ప్రశ్నిస్తే, తమ పరిధిలో ఆ అంశం లేదంటున్నారు. కండోమ్‌ లు మార్కెట్‌ లోకి వచ్చినప్పటి నుండి మగ గర్భనిరోధకాలపై ఎలాంటి పురోగతి లేదు.