Begin typing your search above and press return to search.

భారత రాజ్యాంగ ముసాయి దాను బ్రాహ్మణుడే రాసాడు అంటున్న స్పీకర్ !

By:  Tupaki Desk   |   4 Jan 2020 7:54 AM GMT
భారత రాజ్యాంగ ముసాయి దాను బ్రాహ్మణుడే రాసాడు అంటున్న స్పీకర్ !
X
భారత రాజ్యాంగ ముసాయిదా అనగానే అందరికి మొదట గా గుర్తొచ్చే పేరు డాక్టర్ బీఆర్ అంబేద్కరే గారు. కానీ , డాక్టర్ బీఆర్ అంబేద్కరే గారు ఒక్కరే ఈ రాజ్యాంగ ముసాయిదాని రాయలేదు. కొందరు సభ్యులు ఒక కమిటీగా ఏర్పాటై ..కొన్ని దేశాల రాజ్యాంగాలని బాగా అవపోసన పట్టి ..వాటి స్పూర్తితో మన దేశ రాజ్యాంగ ముసాయిదా ని తయారు చేసారు. అయితే , ఈ భారత రాజ్యాంగ ముసాయిదా రచన పై తాజాగా గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ ముసాయిదాను బ్రాహ్మణుడైన బీఎన్ రౌ రాశారని, ఈ విషయాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కరే స్వయంగా చెప్పి, బీఎన్ రౌకు క్రెడిట్ ఇచ్చారని స్పీకర్ రాజేంద్ర త్రివేది చెప్పారు.

బ్రాహ్మణులు ఎప్పుడూ ఇతర ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహిస్తారని చరిత్ర చెబుతుందని, అడాలజ్ పట్టణంలో తాజాగా జరిగిన మెగా బ్రాహ్మణ బిజినెస్ సదస్సు లో గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీతో సహా 9 మంది భారతీయ నోబెల్ విజేతలలో 8 మంది బ్రాహ్మణులు అని ఆయన తెలిపారు.

60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి,మన ముసాయిదా రాజ్యాంగం తయారు చేశారని మీకు తెలుసా? ఆ ముసాయిదాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఎవరు సమర్పించారో మీకు తెలుసా? రాజ్యాంగం విషయానికి వస్తే మనమందరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును గౌరవంగా తీసుకుంటాం...అయితే, అంబేద్కర్ సొంత మాటల్లోనే ముసాయిదాను బీఎన్ రౌ అనే ఒక బ్రాహ్మణుడు తయారు చేశాడు’’ అని రాజేంద్ర త్రివేది చెప్పారు. బ్రాహ్మణులు ఎప్పుడూ వెనుక నిలబడి ఇతరులను ప్రోత్సహిస్తారని చరిత్ర చెబుతుంది. బీఎన్ రౌ అంబేద్కర్‌ను తనకంటే ముందు ఉంచారు.1949 నవంబర్ 25 న జరిగిన రాజ్యాంగ సభలో తన ప్రసంగంలో అంబేద్కర్ ఈ విషయాన్ని అంగీకరించినందున మేం గర్విస్తున్నాం ”అని త్రివేది వివరించారు.