Begin typing your search above and press return to search.

వారికి జీవితకాలం నో కరెంటు బిల్లు?

By:  Tupaki Desk   |   10 April 2015 6:00 AM GMT
వారికి జీవితకాలం నో కరెంటు బిల్లు?
X
జీవితాంతం ఉచిత కరెంటు.. దేశం మొత్తంలో ఎక్కడ ప్రయాణించినా టోల్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు.. మనమళ్లు.. మనమరాళ్లకు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకునే సదుపాయం.. చదువు కోసం బ్యాంకు రుణాలు.. ఇలాంటి చాలానే వరాలు కేంద్రం ఇవ్వనుంది. స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్న స్వాతంత్య్ర సమరయోధులకు మరింత గౌరవం ఇచ్చేందుకు వీలుగా కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా ఉన్న 12వేల మంది స్వాతంత్య్ర సమరయోధులకు మరింతగా గౌరవించేందుకు వీలుగా వారికి కల్పిస్తున్న వసతుల్లో మరిన్ని జత చేయాలని వారు కోరుతున్నారు. ఇందుకు తగినట్లుగా వారు తమ డిమాండ్లను సిద్ధం చేసి కేంద్రానికి ఇచ్చారు. వారు చేస్తున్న డిమాండ్ల విషయంలో మోడీ సర్కారు సానుకూలంగా స్పందించేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే అందిస్తున్న వసతులకు ఇవి అదనం కానున్నాయి. తాజా డిమాండ్లలో అతి కీలకమైన ఒక అంశం పైనా కేంద్రం ఓకే చెప్పేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు. ప్రతి స్వాతంత్య్ర సమరయోధుడు.. ఒకరికి రైల్వే శాఖలో ఉద్యోగానికి సిఫార్సు చేసేలా అనుమతించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో వీరికి రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు. అంతేకాదు.. తమతో కలిసి ప్రయాణించే డిపెండెట్స్‌కి రాయితీ మీద ట్రైన్‌ ప్రయాణ అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాంటి వరాల్ని తీర్చే దిశగా మోడీ సర్కారు అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం సమపార్జించటంలో కృషి చేసిన వారికి ఏం చేసినా తక్కువే.