Begin typing your search above and press return to search.

నిద్ర పోతున్న పోలీసులు లేపి ఎంత దారుణంగా హత్య చేశారంటే?

By:  Tupaki Desk   |   3 July 2020 12:30 PM IST
నిద్ర పోతున్న పోలీసులు లేపి ఎంత దారుణంగా హత్య చేశారంటే?
X
మరో దారుణం చోటు చేసుకుంది. ఛత్తీస్ గఢ్ లో తన పట్టును నిలుపుకోవటంతోపాటు.. తమ అధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న మావోలు తాజాగా ఒక దారుణ హత్యకు పాల్పడ్డారు. బీజాపూర్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. జిల్లాకు చెందిన జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో 35 ఏళ్ల సోమరు పోయం అనే వ్యక్తి కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.

వైద్య సెలవులపై ఇంటికి వచ్చేశాడు. ఇదిలా ఉండగా.. అతను నిద్ర పోతున్న వేళ.. అతనింటికి వచ్చిన మావోయిస్టు మిలీషియా సభ్యులు అతన్ని నిద్ర లేపారు. బలవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం అత్యంత కిరాతకంగా చంపేయటం సంచలనంగా మారింది.

మారణాయుధాలతో నరకటంతో పాటు.. బాణాలతో అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సదరు పోలీసు అధికారిని దారుణంగా హత్య చేస్తున్న వేళ.. అతడి కుటుంబ సభ్యులు తీవ్రంగా బతిమిలాడారు. అయినప్పటికీ కనికరించకుండా హత్య చేశారు. ఈ ఉదంతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరోవైపు.. రాష్ట్రానికి చెందిన పద్దెనిమిది మంది మావోలు పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోయారు. తమ వద్ద ఉన్న ఆయుధాల్ని అధికారులకు సరెండర్ చేశారు. ఓకే రోజు చోటు చేసుకున్న ఈ రెండు ఘటనలు ఇప్పుడా రాష్ట్రంలో అందరి నోటా నానుతున్నాయి.