Begin typing your search above and press return to search.
3 రాజధానులకు మద్దతుగా కానిస్టేబుల్ రాజీనామా
By: Tupaki Desk | 3 Sept 2020 4:07 PM ISTఏపీలో అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలన్న ఉద్దేశ్యంతోనే పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొచ్చామని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. లెజిస్లేటివ్ కేపిటల్‌గా అమరావతి,జ్యుడీషియల్ కేపిటల్‌గా కర్నూలు,ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖపట్నంలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ఆమోద ముద్ర వేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదని కేంద్రం కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు విచారణలో ఉండగా... హైకోర్టు తీర్పు వచ్చేవరకు రాజధాని అంశంలో యదాతథ స్థితి కొనసాగనుంది. అయితే, ప్రతిపక్ష టీడీపీతో పాటు రాజధాని రైతులు, కొన్ని పార్టీలు అభివృద్ధి వికేంద్రీకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు, ఏపీలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని భావించేవారు ఈ చట్టానికి పూర్తి మద్దతు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ అభిప్రాయాలను వివిధ రూపాల్లో వెల్లడించారు. తాజాగా, మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ మంగళగిరికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ బసవరావ్ రాజీనామా చేశారు.
మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేసిన తొలి ప్రభుత్వ ఉద్యోగిగా బసవరావ్ నిలిచారు. మంగళగిరి మండలం కురగల్లుకు చెందిన బసవరావ్.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని హుమయున్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. అమరావతి పేరుతో ఆనాటి సీఎం చంద్రబాబు భూములను బలవంతంగా లాక్కున్నారని బసవరావ్ ఆరోపించారు. సీఎం జగన్ నిర్ణయానికి తాను మద్దతు తెలుపుతున్నానని, అందుకే ఏపీలో అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇంకా పదేళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగాన్ని వదులుకుంటున్నానని హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు.