Begin typing your search above and press return to search.

వైరల్‌ వీడియో:పోలీసుకే ఫైన్‌ వేయించిన నెటిజన్స్‌

By:  Tupaki Desk   |   6 Sep 2019 4:50 AM GMT
వైరల్‌ వీడియో:పోలీసుకే ఫైన్‌ వేయించిన నెటిజన్స్‌
X
వాహన దారులు ట్రాఫిక్‌ రూల్స్‌ అధిగమిస్తే గతంలో వేసే ఫైన్స్‌ ను భారీగా పెంచిన విషయం తెల్సిందే. సెప్టెంబర్‌ 1 నుండి కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేకింగ్‌ జరిమానాలు అమలు అవుతున్నాయి. ప్రతి రూల్‌ బ్రేకింగ్‌ కూడా బెండు తీసి మరీ జనాల వద్ద డబ్బులు వసూళ్లు చేస్తున్న పోలీసులు వారు మాత్రం ట్రాఫిక్‌ రూల్స్‌ ను పాటించడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంలో పలు సార్లు సోషల్‌ మీడియాలో పోలీసులు ట్రిపుల్‌ రైడింగ్‌ చేయడం.. హెల్మెట్‌ లేకుండా బండి నడపడం.. ఫోన్‌ మాట్లాడుతూ బండి నడపడం వంటివి చేస్తూ ఉన్న ఫొటోలు పోస్ట్‌ అయ్యాయి. వాటిపై పెద్దగా యాక్షన్‌ తీసుకోని ఉన్నతాధికారులు తాజగా నిజామాబాద్‌ జిల్లా కానిస్టేబుల్‌ పై మొదటి సారి జరిమానా విధించారు.

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ బస్‌ స్టాండ్‌ వద్ద ఒక కానిస్టేబుల్‌ ఫోన్‌ మాట్లాడుతూ.. హెల్మెట్‌ లేకుండా బండి పై వెళ్తున్నాడు. అతడిని ఒక వ్యక్తి వీడియో తీయడం.. దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం జరిగింది. ఆ వీడియో కాస్త వైరల్‌ అవ్వడంతో పోలీసులు ఆ బండికి చలానా విధించారు. బండి నెంబర్‌ ఆ వీడియో ఆధారంగా తీసుకుని పోలీస్‌ అయినా పర్వాలేదు రూల్స్‌ అందరికి ఒక్కటే అన్నట్లుగా చలానా విధించడం జరిగింది.

చలానా విధించిన విషయాన్ని కూడా పోలీసులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫోన్‌ మాట్లాడుతూ బండి నడిపినందుకు వెయ్యి రూపాయలు మరియు హెల్మెట్‌ లేని కారణంగా 100 రూపాయలను ఫైన్‌ వేయడం జరిగింది. పోలీసులు కూడా ఇకపై జాగ్రత్తగా ఉండాలని.. నలుగురికి చెప్పే పోలీసులు ముందు తాము వాటిని ఫాలో అవ్వాలని ఉన్నతాధికారులు ఈ ఫైన్‌ తో తమ వారిని సున్నితంగా హెచ్చరించినట్లయ్యింది. సోషల్‌ మీడియా కారణంగా ఎంతో మంది బండారం బయట పడింది. మొదటి సారి ఒక కానిస్టేబుల్‌ కు జరిమాన పడింది.