Begin typing your search above and press return to search.
పాతబస్తీలో కుట్ర ... బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు !
By: Tupaki Desk | 29 Nov 2020 10:00 PM ISTగ్రేటర్ ఎన్నికల్లో మాటల యుద్ధం ముదురుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడేకొద్ది .. నేతల విమర్శలు, ఆరోపణలు చేస్తూ వేడెక్కిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, ఎంఐఎం నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో ఇరు పార్టీలకు చెందిన నాయకులపై కేసులు నమోదు అవుతున్నాయి. అయితే , తాజాగా పాతబస్తీపై మరోసారి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో హిందువులు భయానక వాతావరణంలో జీవిస్తున్నారని , పాతబస్తీని భాగ్యనగరంగా మార్చాలని బీజేపీ కోరుకుంటోందని స్పష్టం చేశారు.
పోలీసులు హీరోలని, భాగ్యనగర్ లో బీజేపీని గెలిపించండని పిలుపునిచ్చారు. పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తామని, పాకిస్థాన్ కుక్కలను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లను, రోహింగ్యా లుచ్చాలను బయటకు గుంజి తరిమేస్తామని వ్యాఖ్యానించారు. పాతబస్తీలో హిందూ జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. శాలిబండ అలియాబాద్ ఉప్పుగూడ లాల్ దర్వాజ గౌలిపుర చాతార్నాకా వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడ పోయారు, అని ప్రశ్నించారు. వాళ్ళ ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారు, ఎవరు కబ్జా చేశారు, అని నిలదీశారు. భాగ్యనగరానికి బీజేపీయే రక్షణ కవచమన్నారు బండి సంజయ్. పాతబస్తీలో ఏడాదికి రూ.600 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఆస్తి పన్ను చెల్లించడం లేదు, నల్లా బిల్లులు చెల్లించడం లేదు. పన్నులన్నీ హిందువులు కడితే పాతబస్తీలో జల్సా చేస్తారా అని ప్రశ్నించారు.ఎన్నో మహానగరాలను భాజపా అభివృద్ధి చేసిందని, హైదరాబాద్ ను కూడా మహానగరంగా అభివృద్ధి చేస్తామని , ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.