Begin typing your search above and press return to search.
ఎంపీ, ఎమ్మెల్యేల మెడకు ఉచ్చు బిగుస్తున్న సుప్రీంకోర్టు
By: Tupaki Desk | 25 Aug 2021 7:00 PM ISTదేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ లో ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులను తేల్చేందుకు దేశంలోని హైకోర్టులకు ఏడాది గడువు పెట్టిన సుప్రీంకోర్టు.. తాజాగా దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.
న్యాయవ్యవస్థ తరహాలోనే సీబీఐ, ఈడీపైనా కేసుల భారం పెరుగుతోందని.. అయినా సరే కేసులను తేల్చేయాల్సిందేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందలాది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో సీబీఐ, ఈడీ కేసులు కూడా ఉన్నాయి. వీటి దర్యాప్తు విచారణ నానాటికీ ఆలస్యం అవుతుండడంపై గతంలోనే సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసుల పెండింగ్ కారణంగా ఆయా ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్యపెట్టి మళ్లీ ఎన్నికల్లో గెలవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారుతోందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసుల విషయాన్ని త్వరగా తేల్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల దర్యాప్తు, విచారణల ఆలస్యంపై ఢిల్లీకి చెందిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కోర్టులకు డెడ్ లైన్ పెట్టింది. ఏడాదిలోగా ఈ కేసులను తేల్చాని హైకోర్టుతోపాటు ట్రయల్ కోర్టులకూ సూచించింది. దీంతో ఇప్పటికే పలు హైకోర్టులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసి విచారణలు చేపడుతున్నాయి. తమ కింద ఉన్న ట్రయల్ కోర్టులను కూడా ఈ కేసుల్లో విచారణలు వేగవంతం చేయాలని పాలనాపరమైన ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఈ కేసులోనే కేసుల దర్యాప్తు వేగవంతం చేయడానికి సిఫార్సులు చేయాలని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియాను సుప్రీంకోర్టు ఆదేశించింది.
సుప్రీం ఆదేశాల మేరకు అధ్యయనం చేసిన విజయ్ హన్సారియా తాజాగా పలు సిఫార్సులు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల్లో సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేసి చార్జీషీట్లను దాఖలు చేయాలని సీబీఐ, ఈడీకి ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులపై కేసుల్లో చార్జీషీట్ల దాఖలులో ఆలస్యం చేయవద్దని ఆదేశాలు ఇచ్చారు. చాలా కేసుల్లో ఏళ్ల తరబడి చార్జీషీట్ల దాఖలు కాకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని సీజేఐ రమణ ప్రశ్నించారు.
ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల్లో విచారణలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో వీటి పర్యవేక్షణకు త్వరలో కొత్త వ్యవస్థ అందుబాటులోకి తెస్తామని సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించారు. ప్రత్యేక కోర్టులు కూడా ఇందులో ఉంటాయని తెలిపారు. ఈ కేసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కానీయకుండా చూడాలని సుప్రీంకోర్టు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో దేశంలోని రాజకీయ నేతల్లో ఆందోళన నెలకొంది. కేసులు నిరూపితమైతే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. కేసులు నమోదైన వారిలో భావి సీఎంలు అనదగ్గ నేతలు ఉండడంతో అందరిలో ఒకటే టెన్షన్ నెలకొంది...
దేశంలో ప్రజాప్రతినిధుల కేసులపై విచారణ యేండ్ల తరబడిగా సాగుతుండడం, కోర్టుల్లో భారీగా పోగుపడి ఉండడంతో.. సుప్రీం దీనికి చెక్ పెట్టాలని భావించింది. ఈ మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని ఆదేశించింది. దేశంలో 4,859 కేసులు తెలంగాణలో 143కేసులు పెండింగ్లో ఉండడం గమనార్హం.