Begin typing your search above and press return to search.

ఇద్దరూ కలిసి చేస్తే అది రేప్ కాదన్న కోర్టు

By:  Tupaki Desk   |   10 March 2016 11:00 PM IST
ఇద్దరూ కలిసి చేస్తే అది రేప్ కాదన్న కోర్టు
X
ఒక అబ్బాయి.. అమ్మాయి స్నేహంతోనో.. ప్రేమతో దగ్గర కావటం.. అది కాస్తా శారీరక సంబంధంగా మారటం ఇవాల్టి రోజుల్లో మామూలైంది. ఇలాంటి సమయాల్లో అబ్బాయిలు.. అమ్మాయిలకు దూరమైనప్పుడు.. అతగాడిపై సదరు అమ్మాయి.. రేప్.. ఛీటింగ్ ఆరోపణలు చేస్తే పరిస్థితి ఏమిటన్న దానికి తాజాగా బొంబాయి హైకోర్టు ఆసక్తికర నిర్ణయాన్ని వెలువరించింది. అదేమంటే..

షోలాపూర్ కి చెందిన ఒక యువకుడు ఒక యువతితో కొంతకాలం సంబంధం నెరిపాడు. అనంతరం వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆ యువకుడిపై ఆ అమ్మాయి రేప్.. మోసం.. నేరపూరిత ఉద్దేశంతో నేరాలకు పాల్పడినట్లుగా ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. దీనిపై అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బొంబాయి హైకోర్టులో హాజరుపర్చారు.

ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి స్పందిస్తూ.. తన భాగస్వామితో శారీరక సంబంధాన్ని పెట్టుకోవటం కారణంగా తలెత్తే పరిణామాల్ని ఒక విద్యావంతురాలైన మహిళకు పూర్తి అవగాహన ఉంటుందని.. అలాంటి కేసులు అత్యాచారం పరిధిలోకి రావని చెప్పటమేకాదు.. సదరు యువకుడికి బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు.. ఆరోపణలు చేసిన యువతి వాదన ఏమిటంటే.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. గర్భవతి అయ్యాక మోసం చేశాడని.. అబార్షన్ చేయించిన తర్వాత నుంచి తనను విడిచి పెట్టినట్లుగా చెబుతోంది. ఈ కేసులో ప్రస్తుతానికి సదరు యువకుడికి బెయిల్ ఇచ్చారు.