Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ.. రాముడు వ‌ర్సెస్ అంబేడ్క‌ర్‌.. టూ హాట్ గురూ!

By:  Tupaki Desk   |   28 Dec 2022 6:30 AM GMT
కాంగ్రెస్ వ‌ర్సెస్ బీజేపీ.. రాముడు వ‌ర్సెస్ అంబేడ్క‌ర్‌.. టూ హాట్ గురూ!
X
ఇటీవ‌ల యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌.. ఓ స‌భ‌లో మాట్లాడుతూ. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని అభిన‌వ అంబేడ్క‌ర్‌గా అభివ‌ర్ణించారు. అంతేకాదు.. మ‌రోసారి కూడా త‌న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న స‌మ‌ర్థిం చుకున్నారు. దీనిపై కాంగ్రెస్ ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. క‌నీసం ప‌న్నెత్తి ఒక్క మాట కూడా అన‌లేదు. కానీ, తాజాగా కాంగ్రెస్ ఎంపీ, అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీని ఆపా ర్టీ సీనియ‌ర్ నేత సల్మాన్ ఖుర్షీద్.. రాముడితో పోల్చడంపై మాత్రం బీజేపీ మండిపడింది.

అంతేకాదు.. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని ధ్వజమెత్తింది. ఇందుకు క్షమాప ణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ''మీ మోడీని అంబేడ్క‌ర్ అన్న‌ప్పుడు.. మా నాయ‌కుడిని రాముడు అన‌డంలో త‌ప్పేంటి'' అన్న‌ది కాంగ్రెస్ వాద‌న‌. అయితే.. బీజేపీ ఎదురుదాడి ఎలా ఉందంటే.. రాహుల్‌(నేష‌న‌ల్ హెరాల్డ్‌) అవినీతి కేసులో బెయిల్పై బయట తిరుగుతున్న వ్యక్తిగా అభివ‌ర్ణించారు. అంతేకాదు.. కోట్లాది మంది కొలిచే భగవంతుడితో పోల్చడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతి న్నాయని బీజేపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఖ‌ర్షీద్ ఏం చేశారు?ఉత్తర్ప్రదేశ్లో భారత్ జోడో యాత్ర కోఆర్డినేటర్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌ ఖుర్షీద్.. ఇటీవ‌ల మొరాదాబాద్లో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని రాముడితో పోల్చారు. రాహుల్ గాంధీ మానవాతీతుడు. చలికి మనమంతా వణుకుతూ జాకెట్లు వేసుకుంటే.. ఆయన మాత్రం టీషర్టు వేసుకొని యాత్రలో పాల్గొంటున్నారు.

రాహుల్ ఓ యోగి. తపస్సు చేసిన విధంగా పూర్తి నిష్ఠతో రాజకీయం చేస్తున్నానని ఆయనే చెప్పారు. కొన్నిసార్లు రాముడి పాదుకలు దేశమంతా తిరుగుతాయి. రాముడు వెళ్లలేని ప్రాంతాలకు ఆయన పాదుకలను భరతుడు తీసుకెళ్లేవారు. అదేవిధంగా మేము పాదుకలను ఉత్తర్ప్రదేశ్కు తీసుకొచ్చాం. పాదుకలు వచ్చాయి కాబట్టి రాముడు సైతం వస్తారని మా నమ్మకం అని అన్నారు.

అయితే.. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ నేతలకు దైవభక్తి, దేశభక్తి కన్నా.. కుటుంబ భక్తి ఎక్కువగా ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాముడి ఉనికినే ప్రశ్నించిందని బీజేపీ నేత‌లు వ్యాఖ్యానించారు.

అయితే.. ఇక్క‌డ కాంగ్రెస్ చేసిన కీల‌క ఆరోప‌ణ ఏంటంటే.. గోద్రా ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారు అంబేడ్క‌ర్ ఎలా అవుతార‌ని?! మొత్తానికి దేశంలో ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ.. వీరికి మాత్రం ఇదే ప‌నా? అని నెటిజ‌న్లు దుయ్య‌బ‌డుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.