Begin typing your search above and press return to search.

బీజేపీతో ఫైట్: టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ సపోర్టు!

By:  Tupaki Desk   |   11 Sept 2020 4:00 PM IST
బీజేపీతో ఫైట్: టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ సపోర్టు!
X
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో బద్ధ శత్రువులైన టీఆర్ ఎస్ - కాంగ్రెస్ లు ఒక్కటయ్యేలా సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఓడించడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అందుకే తెలంగాణలో తమకు ప్రత్యర్థి అయినా సరే టీఆర్ ఎస్ పార్టీకి మద్దతిస్తోంది.

ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత - ప్రస్తుతం టీఆర్ ఎస్ రాజ్యసభ ఎంపీ అయిన కేకేను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు రాజ్యసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గులాం నబీ ఆజాద్ స్వయంగా కేకేకు ఫోన్ చేసి మీరు నిలబడాలని కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రతిపాదన పెట్టారు. దీంతో కేకే వెంటనే కేసీఆర్ నిర్ణయం ప్రకారం ముందుకు వెళుతానని అంటున్నాడు. ఆయనకు ఈ ప్రతిపాదన గురించి తెలియజేశారు.

కేసీఆర్ కనుక ఒప్పుకుంటే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో కలిసినట్టు అవుతుంది. ఇదే దేశ రాజకీయాల్లో అనూహ్య మలుపుగా భావిస్తున్నారు. కేసీఆర్ ఏం చేస్తాడన్నది ఇక్కడ కీలకంగా మారింది. ఒకవేళ టీఆర్ఎస్ ఎంపీ పోటీలో ఉంటే పక్కరాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ మద్దతు ఎవరికి ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. బహుశా టీఆర్ఎస్ కే వైసీపీ మద్దతునిచ్చే అవకాశాలు ఉన్నాయి.

సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేది వరకు పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో తొలి రోజు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వైసీపీకి ఆరుగురు రాజ్యసభ ఎంపీల బలం ఉంది. వైసీపీ కూడా కీలకంగా ఉంది. కేసీఆర్ కనుక ఒప్పుకుంటే దేశ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పుగా చెప్పవచ్చు. కాంగ్రెస్ తో కేసీఆర్ టైఅప్ అయినట్టుగా భావించవచ్చు. బీజేపీతో దోస్తీ కటీఫ్ అవుతుంది.