Begin typing your search above and press return to search.

తుదిశ్వాస విడిచిన కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ సీఎం !

By:  Tupaki Desk   |   21 Dec 2020 2:00 PM GMT
తుదిశ్వాస విడిచిన కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ సీఎం !
X
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత , మధ్యప్రదేశ్ మాజీ సీఎం మోతీలాల్ వోరా తుదిశ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మోతీలాల్ వోరా చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. వోరా మృతిప‌ట్ల కాంగ్రెస్ నాయ‌కులు సంతాపం ప్రకటించారు.

అక్టోబరులో కరోనా బారినపడ్డ మోతీలాల్ వోరా.. చికిత్స అనంతరం కోలుకుని అక్టోబరు 16 ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే, రెండు రోజుల కిందట ఆయన అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్చించారు.వయసుపై బడటం వల్ల శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం అర్ధరాత్రి నుంచి నుంచి క్షీణించడంతో సోమవారం ఉదయం మృతి చెందారు.

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మోతీలాల్ వోరా మృతిప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. మోతీలాల్ వోరా నిజ‌మైన కాంగ్రెస్‌ వాది అని రాహుల్ పేర్కొన్నారు. ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితంలో విస్తార‌మైన పాల‌నా అనుభ‌వం ఉన్న నాయ‌కుడిని కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని మోదీ అన్నారు.

ఇకపోతే, మోతీలాల్ వోరా మధ్యప్రదేశ్ ‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019 లోక్ ‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్న తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. చత్తీస్ ‌గఢ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.