Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కొత్త దళపతి కోసం కౌంట్ డౌన్
By: Tupaki Desk | 16 Oct 2022 7:05 PM ISTదేశంలో అతి పురాతనమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ లో సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి. అది కూడా రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలం తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి అయితే ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా ఇతరలు కుర్చీ మీద కూర్చోవడం గతంలో జరిగినా ఈసారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది.
కాంగ్రెస్ కురు వృద్ధుడు ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా ఆ పార్టీకి అంకితం అయి పనిచేస్తున్నా తగినంత గుర్తింపు తెచ్చుకోని నేతగా కర్నాటకకు చెందిన మల్లికార్జున ఖర్గె ఉన్నారు. ఆయనకు సోనియా గాంధీ మంచి గుర్తింపు ఇచ్చారు. అది కూడా యూపీఏ సర్కార్ ఓడాక ఒక టెర్మ్ లోక్ సభలో కాంగ్రెస్ విపక్ష నేతగా చాన్స్ ఇస్తే మరోసారి రాజ్యసభలో కాంగ్రెస్ తరఫున విపక్ష సారధిగా ఖర్గె ఉన్నారు.
ఇపుడు ఆయన్ని తీసుకువచ్చి కాంగ్రెస్ అగ్రాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారు. ఖర్గె విధేయత ఎంత గొప్పది అంటే ఆయనకు ఎన్నో సార్లు కర్నాటక వంటి ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం చివరి నిముషం దాకా వచ్చి వెనక్కి పోయినా కాంగ్రెస్ అధినాయకత్వం మీద ఏ మాత్రం అసంతృప్తి పెంచుకోకుండా కట్టుబడి పనిచేశారు.
ఆయన కంటే ముందు రాజస్థాన్ సీం అశోక్ గెహ్లాట్ ని అధ్యక్షుడిగా కాంగ్రెస్ అనుకుంది. కానీ ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం రాజస్థాన్ లోనే సొంత పార్టీలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారన్న ప్రచారం నేపధ్యంలో తప్పించారు. మరి ఆయనతో పోలిస్తే ఖర్గె విధేయత చాలా గొప్పది అనే చెప్పుకుంటారు.
అందుకే ఆయనకే గాంధీలు ఓటేస్తున్నారు. ఇక మరో పోటీదారుగా కేరళకు చెందిన మాజీ కేంద్ర మంత్రి శశిధరూర్ ఉన్నారు. ఆయన నవ భావాలు ఉన్న కాంగ్రెస్ నేత. గాంధీల మాటకు విలువ ఇస్తూనే కాంగ్రెస్ ని తాను అనుకున్న తీరున ముందుకు తీసుకువెళ్లాలని భావించే వ్యక్తి. అయితే ఆయన భావజాలం గాంధీలకే కాదు, కాంగ్రెస్ లో ఎంతమందికి నచ్చుతుంది అన్నది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తేలిపోనుంది.
ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి పదివేల మంది దాకా డెలిగేట్లు ఉన్నారు. వీరే ఓటర్లుగా రేపు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కర్నాటకలో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడే తన ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. అవసరమైన పోలింగ్ బాక్సులను అన్ని రాష్ట్రాలకు పంపించారు. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 20న ఢిల్లీలో జరుగుతుంది. మొత్తానికి ఓటింగ్ లో ఏ ఆసక్తికరమైన పరిణామాలు ఉంటాయో చూడాలి. అదే టైం లో ఎవరు ప్రెసిడెంట్ అయినా ఈ సారి సౌత్ కే కాంగ్రెస్ పీఠం అని స్పష్టం అవుతున్న విషయం.