Begin typing your search above and press return to search.

సచిన్ పైలట్.. ఎటూ కాకుండా పోయాడా?

By:  Tupaki Desk   |   29 July 2020 3:40 PM IST
సచిన్ పైలట్.. ఎటూ కాకుండా పోయాడా?
X
రాజస్థాన్ లో సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై అసమ్మతి రాజేసిన తిరుగుబాటు నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా ఎటూ కాకుండా పోయారని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయనకు ఆ పార్టీ మద్దతు లేక.. ఇప్పుడు సానుభూతి కూడా పోయిందని పరిశీలకులు భావిస్తున్నారు.

మరోవైపు బీజేపీలో చేరనని చెప్పడంతో రెండో దారి మూసుకుపోయింది. దీంతో అటు కాంగ్రెస్ కు.. ఇటు బీజేపీకి కాకుండా సచిన్ పైలట్ ఒంటరి అయ్యారు. ఆయనపై అనర్హత వేటును సీఎం అశోక్ గహ్లోత్ వేయడంతో అది ఆమోదిస్తే ఇక ఎమ్మెల్యేగానూ సచిన్ పైలెట్ చరిత్ర ముగియనుంది.

సచిన్ పైలట్ తిరుగుబాటు చేయగానే ప్రియాంకా గాంధీ, పి చిదంబరం లాంటి వారితో సోనియా, రాహుల్ తో రాజీ యత్నాలు చేశారు. కానీ సీఎం అశోక్ గెహ్లాత్ ను తొలగించాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశాడు. దీంతో అది సాధ్యం కాలేదు. మరోవైపు బీజేపీతో సచిన్ పైలట్ సంప్రదింపుల ఆడియో టేపులు బయటపడడంతో ఆయనకు కాంగ్రెస్ లోని మిగతా ఎమ్మెల్యేల మద్దతు కరువైంది.

ఇలా కాంగ్రెస్ కాలదన్ని.. బీజేపీలోకి చేరక.. సీఎం అశోక్ గహ్లోత్ తో లొల్లి పెట్టుకొని సచిన్ పైలట్ తన రాజకీయ జీవితాన్ని ఆగం చేసుకున్నాడనే చర్చ మొదలైంది.