Begin typing your search above and press return to search.

తేల్చేశారంట‌: రాజ‌య్య‌పై వేటు ప‌క్కా!

By:  Tupaki Desk   |   6 Nov 2015 9:30 PM IST
తేల్చేశారంట‌: రాజ‌య్య‌పై వేటు ప‌క్కా!
X
అస‌లే ఎన్నిక‌ల కాలం. అందులోకి గాలి వాటంగా లేని ప‌రిస్థితి. ఇలాంటి స‌మ‌యంలో రాజ‌య్య ఇంట్లో లాంటి ఘ‌ట‌న లాంటిది జ‌రిగితే దాని ప్ర‌భావం పోలింగ్ మీదా.. పార్టీ మీద ప‌డ‌టం ఖాయం. అందుకే..కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం మాజీ ఎంపీ రాజ‌య్య మీద వేటు వేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. వరంగ‌ల్ ఉప ఎన్నిక‌ల వేళ‌.. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బరిలోకి రాజ‌య్యను దింపుతూ పార్టీ నిర్ణ‌యం తీసుకోవ‌టం.. అనూహ్యంగా ఆయ‌న కోడ‌లు.. ముగ్గురు మ‌న‌మ‌లు అతి దారుణంగా మృత్యువుపాలు కావ‌టం తీవ్ర సంచ‌ల‌నంగా మార‌టం తెలిసిందే.

ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చిన వెంట‌నే పార్టీ అభ్య‌ర్థిగా నిర్ణ‌యించిన రాజ‌య్య‌ను త‌ప్పించి.. స‌ర్వే స‌త్యానారాయ‌ణ‌ను రంగంలోకి దింపారు. అయితే.. అభ్య‌ర్థిని మార్చ‌టంతోనే ప‌ని పూర్తి కాలేద‌ని.. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన రాజ‌య్య‌పై పార్టీ ప‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

ఈ దుర్ఘ‌ట‌న‌పై ప‌లు సందేహాలు వ్య‌క్తం కావ‌టం.. వేళ్ల‌న్నీ రాజ‌య్య ఫ్యామిలీ వైపు చూపిస్తున్న వేళ‌..కాంగ్రెస్ పార్టీ ఇరుకున ప‌డింది. రాజ‌య్య ప్ర‌భావం కానీ పార్టీ మీద ప‌డితే.. ఉప ఎన్నిక‌ల్లో ఇబ్బంది ప‌డ‌టం ఖాయం. అస‌లు గాలి వాటంగా లేద‌న్న వేద‌న‌లో ఉన్న కాంగ్రెస్ కు రాజ‌య్య ఇంట ప‌రిణామం బాగా ఇబ్బందిపెడుతోంది. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఈ వ్య‌వ‌హారాన్ని రాజ‌కీయం చేస్తే పార్టీ భారీగా న‌ష్ట‌పోవ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న పార్టీలో జోరుగా సాగుతోంది.

అందుకే.. ఆయ‌న‌పై పార్టీ వేటు వేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్ కు మ‌ద్దుతు పెరుగుతోంది. రాజ‌య్యపై ఏ మాత్రం సానుకూల‌త ప్ర‌ద‌ర్శించినా.. పార్టీకి అది అప్ర‌తిష్ట‌గా మారుతుంద‌ని ప‌లువురు వార్నింగ్ ఇస్తున్నారు . ఈ నేప‌థ్యంలో రాజ‌య్య‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌న్న నిర్ణ‌యాన్ని పార్టీ అధినాయ‌క‌త్వం తీసుకుంద‌ని చెబుతున్నారు. అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌క‌పోయినా.. రాజ‌య్య‌పై వేటుకు అవ‌స‌ర‌మైన ప్ర్ర‌కియ‌ను సిద్ధం చేశార‌ని చెబుతున్నారు.